Rashmika Mandanna Video: నడవలేని స్థితిలో రష్మిక మందన్న.. వీల్ చైర్‌లో ఎయిర్ పోర్టుకు.. వీడియో వైరల్..

Rashmika mandanna in wheelchair: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆతర్వాత వీల్ చైర్ లో ఎయిర్ పోర్ట్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 22, 2025, 11:35 AM IST
  • శంషాబాద్ లో రష్మిక మందన్న..
  • ఎమోషనల్ అవుతున్న అభిమానులు..
Rashmika Mandanna Video: నడవలేని స్థితిలో రష్మిక మందన్న.. వీల్ చైర్‌లో ఎయిర్ పోర్టుకు.. వీడియో వైరల్..

Rashmika mandanna in wheelchair at shamshabad airport: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల జిమ్ చేస్తున్న సమయంలో ఆమె కాలి బెనికిన విషయం తెలిసిందే. దీంతో ఆమె నడవలేని స్థితికి చేరుకున్నారు. డాక్టర్లు కొన్నిరోజులు రెస్ట్ తీసుకొవాలని చెప్పారు.  అయితే.. రష్మిక తాజాగా.. తన కారులో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కారు దిగి ఆమె వీల్ చైర్  లోకూర్చుని ఎయిర్ పోర్టు లోపలికి వచ్చారు.

ఆమె ఒకరి సహాయం లేకుండా నాలుగు అడుగులు కూడా వేయలేకపోయారు.  ఇటీవల జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న కాలు బెణికింది. అయితే… ఆ గాయం మరింత పెద్దది అయినట్లు తెలుస్తొంది.

 

ఈ తరుణంలోనే… తాజాగా నడవలేని స్థితిలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వీల్ చైర్‌లో ప్రత్యక్షమయ్యారు ఛావా బ్యూటీ రష్మిక మందన్న. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు. టాలీవుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

ఇదిలా ఉండగా.. రష్మిక మందన్న ఛావా మూవీలో మహారాణిలా కన్పించనున్నారు . ఇటీవల ఏసుబాయ్ లుక్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. దీనిపై ఒక రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది.  దీనిలో విక్కి కౌశాల్ హీరోగా శంభాజీ పాత్రలో నటిస్తున్నారు.

Read more:  Rashmika Mandanna: మహారాణి లుక్‌లో గత్తర రేపుతున్న రష్మిక మందన్న.. వైరల్‌గా మారిన చావా మూవీ పోస్టర్..

రష్మిక మందన్న ఏసుబాయ్ లో శంభాజీ సతీమణిగా చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ ఈ రోజు విడుదల కానుంది.  ఈ మూవీకి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా.. ఫిబ్రవరీ 14న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News