RRR Release Date: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన Director Rajamouli

RRR Release Date Update: టాలీవుడ్ దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్టారర్‌గా వస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 25, 2021, 05:22 PM IST
  • టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’
  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా వస్తున్న సినిమా
  • శరవేగంగా షూటింగ్ జరుగుతున్న మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన డైరెక్టర్ రాజమౌళి
RRR Release Date: ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన Director Rajamouli

RRR Release Date: బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా వస్తున్న సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా అప్‌డేట్ అందించారు జక్కన్న రాజమౌళి.

ఇటీవల సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించిన సమయంలోనూ వీడియో అప్‌డేట్ అందించిన ఎస్ఎస్ రాజమౌళి(Director Rajamouli) తాజాగా ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 13న నీరు, నిప్పును ఎవరూ ఆపతరం కాదంటూ దర్శకుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్(RRR To Release On October 13)‌ను అనౌన్స్ చేశారు. ఈ మేరకు రాజమౌళి చేసిన ట్వీట్ సెన్సేషన్ అవుతోంది.

Also Read: Mahesh Babu: ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు

 

 

గుర్రంపై రామ్‌చరణ్‌, బులెట్‌పై ఎన్టీఆర్‌లు దూసుకుపోతున్న పోస్టర్‌‌ను రాజమౌళి(Director Rajamouli) పోస్ట్ చేశారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా కనిపించనున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటించారు. చెర్రీకి జోడీగా అలియా భట్, తారక్‌తో హాలీవుడ్ బ్యూటీ ఒలివియా జత కట్టింది. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: RRR release date: రాజమౌళికి RRR movie ని డైరెక్ట్ చేయడం కంటే పెద్ద టాస్క్

 

తెలుగు భాష(Tollywood)లో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ మూవీని తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News