Sai Pallavi Video: పుట్టపర్తిలో సాయి పల్లవి.. న్యూ ఇయర్ వేళ భక్తులతో కలిసి భజనలు చేసిన అమరన్ బ్యూటీ.. వీడియో వైరల్..

Sai Pallavi at puttaparthi: హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం పుట్టపర్తి సత్య సాయి బాబావారిని దర్శనం చేసుకున్నట్లు తెలుస్తొంది. భక్తుల మధ్యలో సామాన్య భక్తురాలిగా ధ్యానంచేస్తు, భజనలు చేశారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 1, 2025, 03:59 PM IST
  • న్యూ ఇయర్ వేళ పుట్టపర్తిలో సాయిపల్లవి..
  • ప్రత్యేకంగా సాయి సన్నిధిలో పూజలు..
Sai Pallavi Video:  పుట్టపర్తిలో సాయి పల్లవి.. న్యూ ఇయర్ వేళ భక్తులతో కలిసి భజనలు చేసిన అమరన్ బ్యూటీ.. వీడియో వైరల్..

sai Pallavi visits puttaparthi video viral: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ఇటీవల ఎక్కువగా టెంపుల్స్ ట్రిప్స్ లు వేస్తున్నట్లు తెలుస్తొంది. కొద్ది రోజుల క్రితమే వారణాసిని వెళ్లి అక్కడ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణదేవీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. అదేవిధంగా నటి అంతకు ముందు తన చెల్లి, ఫ్రెండ్స్ తో కలిసి ఆస్ట్రేలియాకు కూడా వెళ్లారు .

అయితే.. రీసెంట్ గా సాయి పల్లవి తన చెల్లెలు పెళ్లి జరిగి అప్పుడే మూడు నెలలు అయిపోయాయని పెళ్లి ఫోటోలు ఇన్ స్టాలో షేర్ చేశారు. పూజకన్నన్ తో కలిసి పెళ్లిలో ఎంజాయ్ చేసిన విషయాల్ని పంచుకున్నారు. అదేవిధంగా ప్రస్తుతం పూజకన్నన్ కు మునుపటిలా సలహాలు ఇవ్వలేనని.. తన భర్త.. నాకన్న బాగా చూసుకుంటున్నాడని మరిదిమీద సాయిపల్లవి ప్రశంసలు కురిపించారు.

 

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సాయిపల్లవి పుట్టపర్తికి వచ్చినట్లు తెలుస్తొంది. అయితే.. న్యూ ఇయర్ అంటేనే అందరు గోవా లేదా మరే కోత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. కానీ సాయిపల్లవి మాత్రం అందరిలాగా కాకుండా చాలా సింపుల్గా పుట్టపర్తిలో సామాన్య భక్తురాలిగా.. అందరి మధ్య కూర్చుని ధ్యానం, భజనలు చేశారు.

పుట్టపర్తి సాయిబాబా వారి ప్రశాంతి నిలయంలో ప్రత్యేకంగా భజనలు సైతం చేశారు. అయితే.. సాయిపల్లవి సింప్లిసిటీని చూసి నెటిజన్లు మాత్రం ఫిదా అవుతున్నారంట. కొందరు మాత్రం.. సాయిపల్లవి మిగత హీరోయిన్ లాగా కాదని కూడా కామెంట్లు చేస్తున్నారంట.

Read more: Keerthy Suresh: సమంత కావాలని ఇరికించింది..!.. పెళ్లయ్యాక షాకింగ్ నిజం రివీల్ చేసిన కీర్తి సురేష్.. మ్యాటర్ ఏంటంటే..?

నాగచైతన్యతో తెలుగులో `తండేల్‌` సినిమాలో నటిస్తోంది. చందూమొండేటి దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఫిబ్రవరీలో ఈ మూవీ అభిమానుల ముందుకు రానుందని తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News