Saif Ali khan attacked latest update: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డారు. ఇప్పటికే ఆయనకు చికిత్సను అందించిన లీలావతి ఆస్పత్రి వైద్యులు బులెటిన్ ను విడుదల చేశారు. ఆయన వెన్నెముకలో ఉన్న కత్తిని తొలగించినట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హెల్త్ నిలకడగా ఉందని.. ఆయన డెంజర్ నుంచి బైటపడ్డారని వైద్యులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. సైఫ్ అలీఖాన్ ఇంట్లోని సీసీ కెమెరాలోని ఫుటేజీలను పరిశీలించారు. అంతే కాకుండా.. సెక్యురిటీ వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు.. పక్కింటి వాళ్ల సీసీ ఫుటేజీలను పరిశీలించారు . దానిలో ఇద్దరు నిందితుల ఆనవాళ్లు లభించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితులు ఫైర్ ఎస్కేప్ మార్గంగుండా ఇంట్లోకి ప్రవేశించినట్లు ముంబై క్రైమ్ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత చోరీకి ప్రయత్నించి.. సైఫ్ తో పెనుగులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో..సైఫ్ పై దాడికి ఇద్దరు అని తెలుస్తొంది. ఇప్పటికే ఫింగర్ ప్రింట్స్ ను తీసుకున్న పోలీసులు.. ఫోరెన్సీక్ ల్యాబ్ కు తరలించారు . ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటన బాలీవుడ్ లో సంచలనంగా మారింది.
నిన్న రాత్రి 2 గంటల ప్రాంతంలో దొంగలు సైఫ్ ఇంటికి.. ఫైర్ రూఫ్ నుంచి లోపలికి ప్రవేశించారు. అలికిడి విన్పించగానే.. సైఫ్ ఒక్కసారిగా బైటకు వచ్చి చూశారు. దీంతొ పెనుగులాట సంభవించింది. దొంగలు సైఫ్ పై.. కత్తితొ ఇష్టమున్నట్లు మెడ, పొట్టపై పొడిచారు.
వెంటనే సైఫ్ కేకలు వేయడంతో ఆయన కుమారుడు మెల్కొన్నాడు. రక్తపు మడుగులో ఉన్న తండ్రిని లీలావని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో సైఫ్ పై దాడి ఘటన మాత్రం బాలీవుడ్ లో షాకింగ్ కు గురిచేసేదిగా మారింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter