Samantha on Divorce Issue: టాలీవుడ్ అగ్రనటి సమంతా సోషల్ మీడియాలో ఓ ట్రెండింగ్. ఏం మాట్లాడినా..ఏం చేసినా వైరల్ అవుతోంది. నాగచైతన్యతో విడాకుల అంశంపై మళ్లీ స్పందించనంటూ కోప్పడుతోంది. ఏం జరిగిందంటే.
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించినంతవరకూ సమంతా, నాగచైతన్యల వివాహం ఎంత ప్రాచుర్యం పొందిందో..విడాకుల అంశం కూడా అంతే వైరల్ అయింది. సంచలనం రేపింది. టాలీవుడ్ బెస్ట్ కపుల్ ఇలా విడాకులు తీసుకోవడం ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా అభిమానులు. అందుకే సమంతా ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. ట్రెండ్ అవుతోంది. వైరల్ అవుతోంది. విడాకుల అంశంపై సమంతా చాలాసార్లు స్పందించింది. ఎందుకా పరిస్థితి వచ్చిందో చెప్పకనే చెప్పింది. అయయినా ఇప్పటికీ కారణాల గురించి ఆమెను ప్రశ్నిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్త అసహనం ప్రదర్శించింది. నాగచైతన్యతో(Naga Chaitanya)విడాకుల విషయంపై మళ్లీ మళ్లీ మాట్లాడటం ఇష్టం లేదని చెప్పేసింది. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా..కధనాలు రాసినా తన అభిప్రాయం ఇప్పటికే చెప్పేశానంది. మళ్లీ స్పందించాల్సిన అవసరం లేదని సమంత(Samantha) అలియాస్ సామ్ చెప్పింది. విడాకుల సమయంలో చాలా ఎక్కువగా కృంగిపోయానని చెప్పిన సమంత...ఓ దశలో చనిపోవాలనుకునే విషయాన్ని కూడా వెల్లడించింది. అందుకే ఈ విషయంపై మాట్లాడటం ఇష్టం లేదంటోంది.
2017లో పెళ్లిచేసుకున్న ఈ జంట..2021 అక్టోబర్ 2న విడిపోయింది. విడాకుల అనంతరం సమంతా (Samantha)కెరీర్ పరంగా చాలా బిజాగా మారిపోయింది. వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్(Tollywood), బాలీవుడ్లో దూసుకెళ్తోంది. అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. అంతేకాదు ఓ హాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టిన సమంతా..ఫుల్ బిజీగా మారిపోయంది. కొత్త లైఫ్‌ను లీడ్ చేస్తోంది. కెరీర్ పరంగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
Also read: Akhanda: బాక్సాఫీస్ పై బాలయ్య సింహగర్జన..100కోట్ల క్లబ్ లో 'అఖండ'...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook