Samantha Ruth Prabhu: టర్కిష్ బాత్ తో రిలాక్స్ అవుతున్న సమంత

Samantha Ruth Prabhu Turkish bath: హీరోయిన్ సమంత రూత్ ప్రభు విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కలిసి చేస్తున్న ఆమె టర్కీకి ఆ సినిమా షూటింగ్‌ కోసమే వెళ్లింది. ఇక అక్కడే ఆమె టర్కిష్ బాత్ ఎంజాయ్ చేస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jun 6, 2023, 02:00 PM IST
Samantha Ruth Prabhu: టర్కిష్ బాత్ తో రిలాక్స్ అవుతున్న సమంత

Samantha Ruth Prabhu Turkish bath News: హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఈ మధ్య వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక తాజాగా తన బిజీ షెడ్యూల్ నుండి కొంత విరామం తీసుకుని టర్కీలోని ఇస్తాంబుల్‌లో టర్కిష్ బాత్ ను ఆమె ఆస్వాదించారు. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా కలిసి చేస్తున్న  ఆమె టర్కీకి ఆ సినిమా షూటింగ్‌ కోసమే వెళ్లింది.

ఇక అక్కడ షూట్ జరిగిన తరువాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి అక్కడే మరికొన్నాళ్లు ఉండాలని నిర్ణయించుకుంది. సమంత ఈ మినీ-బ్రేక్‌లో హమామ్ స్పాలో ఎంజాయ్ చేసింది. దాన్ని సాధారణంగా టర్కిష్ బాత్ అని పిలుస్తారు. టర్కిష్ బాత్ అనేది ఒక రకమైన స్టీమ్  స్నానం. దీనిని శరీరాన్ని శుభ్రపరచి, విశ్రాంతి తీసుకునే విధంగా క్రియేట్ చేశారు. స్టీమ్, ఎక్స్‌ఫోలియేషన్, మసాజ్‌ తో బాడీని రిలాక్స్ అయ్యేలా ఈ ప్రాసెస్ ఉంటుంది.

Also Read: Prabhas: తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న ప్రభాస్.. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కు సర్వం సిద్దం

ఇక దాన్ని ఎంజాయ్ చేస్తూనే సమంతా ఇస్తాంబుల్‌లో తన వెకేషన్ నుంచి కొన్ని మరపురాని ఫోటోలను షేర్ చేసింది. ఇక ఆమె షేర్ చేసిన ఫోటో డంప్‌లో ఆమె అనేక ఫోటోలను షేర్ చేసింది. 'ఖుషి లో సమంతతో కలిసి నటించిన విజయ్ దేవరకొండ కూడా కొన్నాళ్ల క్రితమే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అయినా ఇప్పుడు కూడా సమంత అక్కడే ఉండి ఎంజాయ్ చేస్తోంది.

ఇక టర్కీలో విజయ్ దేవరకొండ, సమంత మీద ఖుషీ సినిమా కోసం అక్కడే ఒక సాంగ్ షూట్ చేశారు. అయితే వారి షెడ్యూల్ గురించి వివరాలు బయటకు రాలేదు. ఇక సమంత ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో విజయ్‌తో కలిసి పని చేయగలిగినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే విజయ్ మంచి చెడు సమయాల్లో తనకు అండగా నిలిచే స్నేహితుడిగా అభివర్ణించింది. ఇక ఖుషీ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో సెప్టెంబర్ 1, 2023న విడుదల కానుంది.

Also Read: Keerthy Suresh Photos: పొట్టి గౌనులో కీర్తి సురేష్ అందాల విందు.. హీటెక్కిస్తోందిగా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News