Martin Luther King Teaser: ఇంట్రెస్టింగ్ గా సంపూర్ణేశ్ బాబు‘'మార్టిన్ లూథర్ కింగ్'’ టీజర్

Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 06:42 PM IST
Martin Luther King Teaser: ఇంట్రెస్టింగ్ గా సంపూర్ణేశ్ బాబు‘'మార్టిన్ లూథర్ కింగ్'’ టీజర్

Martin Luther King Teaser: బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ సెటైరికల్‍ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీకి యువ డైరెక్టర్ వెంకటేశ్ మహా స్క్రీన్‍ప్లే, డైలాగ్‍లు అందింటంతో పాటు కీలకపాత్ర పోషించారు. సీనియర్ నటుడు నరేష్ కూడా ఇందులో నటించారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. 

తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రచార చిత్రం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూవీ రూపొందినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇందులో సంపూకు జోడిగా హీరోయిన్ శరణ్య ప్రదీప్ నటించారు. ఈ మూవీని శశికాంత్, చక్రవర్తి రామచంద్ర సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందించారు. ఈ మూవీని అక్టోబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

తమిళ సూపర్ హిట్ మూవీ మండేలాకు రీమేక్‍గా ఈ మూవీ తెరకెక్కింది. మండేలా సినిమాలో యోగిబాబు పోషించిన ప్రధాన పాత్రను మార్టిన్ లూథర్ కింగ్‍‍లో సంపూర్ణేశ్ బాబు చేస్తున్నాడు. హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నటుడు సంపూర్ణేష్ బాబు. తొలి సినిమాతోనే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుదు. ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట సినిమా కూడా సంపూకు(Sampoornesh Babu) మంచి పేరే తెచ్చి పెట్టింది.  అయితే గత కొనాళ్లుగా సంపూకు సరైన హిట్ లేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు ఈ బర్నింగ్ స్టార్. 

Also Read: Bigg Boss 7 Eliminations: హౌస్ నుంచి రతిక ఔట్.. బిగ్‌ బాస్‌ హిస్టరీలో ఇదే తొలిసారి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  

Trending News