Justice for Sushant forum: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant Singh Rajput ) మరణం తరువాత బాలీవుడ్‌లో నెపోటిజం ( Nepotism ) గురించి తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. బడా నిర్మాతలు, మేకర్స్ ట్యాలెంట్ కన్నా రిఫరెన్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా దీనిపై ప్రముఖ హిందీ నటుడు శేఖర్ సుమన్ ( Shekhar Suman ) జస్టిస్ ఫర్ సుశాంత్ ( Justice for sushanth ) పేరిట ఓ ఫోరంను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశాడు.
Im forming a Forum called #justiceforSushantforum.where i implore just about ev one to pressurize the govt to launch a CBI inquiry into Sushant's death,raise their voices against this kind of tyranny n gangism and tear down the mafias.i solicit your support.
— Shekhar Suman (@shekharsuman7) June 23, 2020
'' సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనక ఉన్న అసలు కారణాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేపట్టాలి. ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నేను #justiceforsushant అనే ఫోరంను ఏర్పాటు చేస్తున్నాను. బాలీవుడ్‌లో గ్యాంగ్ ఇజంను ముక్కలు చేయడానికి మీ అండను కోరుతున్నాను'' అని ట్వీట్‌లో విజ్ఞప్తి చేశారు.
Justice for Sushant: సుశాంత్‌కు న్యాయం జరిగేందుకు ఫోరం ఏర్పాటు