నటీనటులు: జగపతి బాబు, అనసూయ, దివీ వైద్య, వశిష్ఠ, కబీర్ దుహన్ సింగ్, శ్రీనాథ్ మాగంటి తదితరులు
సంగీతం: కృష్ణ సౌరభ్
నిర్మాత: సంపత్ నంది, డి. రాజేందర్ రెడ్డి
దర్శకత్వం: మురళీ మనోహర్
విడుదల తేది: 9-8-2024
గత కొంత కాలంగా మన దర్శకులు నిర్మాతలుగా మారి కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ కోవలో దర్శకుడు సంపత్ నంది తన నిర్మాణంలో మురళీ మనోహర్ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ ‘సింబా’ మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమాకు సంపత్ నంది స్వయంగా కథను అందించారు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
హైదరాబాద్ మహ నగరంలో వరుస హత్యలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ హత్యకు గురైన వాళ్లు ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ పార్ధ (కబీర్ సింగ్) కు సంబంధించిన వాళ్లే. ఈ హత్యల వెనక అక్షిక (అనసూయ), జర్నలిస్ట్ ఫాజిల్ (శ్రీనాథ్ మాగంటి) ఉన్నట్టు పోలీసులు తమ ఇన్వెష్టిగేషన్ లో కనుగొంటారు. అయితే.. ఈ హత్యలు చేసింది వీళ్లేనా.. ? మరేవరైనా చేసి వీళ్లపై ఆ నేరం మోపారా.. ? అసలు పారిశ్రామిక వేత్త అయిన పార్ధ అనుచరులే ఎందుకు హత్యకు గురవుతుంటారు ? ఈ క్రమంలో పోలీసుల ఇన్వెష్టిగేషన్ లో పురుషోత్తం రెడ్డి (జగపతిబాబు) అనే వ్యక్తి తారస పడతాడు. ఆయన ఎవరు.. ? ఈ హత్యల వెనక మోటివ్ ఏమిటి..? ఇండస్ట్రిలిస్ట్ పార్ధకు, అక్షిక, జర్నలిస్ట్ ఫాజిల్ కు పురుషోత్తం రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
దర్శకుడు తాను అనుకున్న కథ బాగానే ఉన్న దాన్ని ఇంకాస్త మెరుగు పెడితే బాగుండేది. వరుస హత్యలు, దాని వెనక ఓ మోటివ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఇది చాలు ప్రేక్షకులను సీటు నుంచి కదలకుండా చేయోచ్చు.ముఖ్యంగా మన దగ్గర ఉన్న పారిశ్రామిక వేత్తలు చాలా మంది ప్రకృతిని లక్ష్య పెట్టక ఇష్టానుసారంగా వారి వ్యాపారం కోసం ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నారు. వారు ఎవరికీ డైరెక్ట్ హాని చేయకపోయినా.. మన భావి తరాలకు మాత్రం తీరని నష్టం కలిగిస్తున్నారు. అదే పాయింట్ నేపథ్యంలో దర్శకుడు ఈ సినిమాను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా సినిమాను అల్లుకున్నాడు. ముఖ్యంగా ప్రకృతి వినాశనం అయితే.. అంతా విధ్వంసమే అని ఈ సినిమాలో చెప్పాడు. ఈ సినిమాలో మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని కాపాడాలి అనే కాన్సెప్ట్ ను అంతర్లీనంగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. ముఖ్యంగా దర్శకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇంకాస్త బాగా రాసుకొని ఉంటే బాగుండేది. కథలో సెల్యూలర్ మెమరీ అనే కొత్త పాయింట్ చూపించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు . ఆర్ఆర్ ఇంకాస్త బెటర్ గా బాగుండేది. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎడిటర్ తన కత్తెరకు పనిచెప్పి ఉంటే బాగుండేది.
నటీనటుల విషయానికొస్తే..
జగపతి బాబు చాలా రోజుల తర్వాత తనదైన నటన చూపించాడు. ప్రకృతి ప్రేమికుడిగా అతని నటన ఆకట్టుకుంటుంది. రంగస్థలం, పుష్ప తర్వాత అనసూయ కు ఇందులో మంచి పాత్ర దక్కింది. ఒక్క ఉపాధ్యాయురాలిగా నటిస్తూనే యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేసింది. వశిష్ఠ సింహా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
పంచ్ లైన్.. ‘సింబా’.. మెసేజ్ ఇచ్చే క్రైమ్ థ్రిల్లర్..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter