Sreeleela: స్టార్ హీరో సినిమాకి సైతం నో చెప్పిన శ్రీలీల.. కారణం అదే!

Sreeleela Upcoming Movies: క్యూట్ బ్యూటీ శ్రీ లీల కు యూత్ లో యమ క్రేజ్ ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం చిత్రంలో నటించిన శ్రీ లీల. ఆ తర్వాత నెక్స్ట్ మూవీ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అమ్మడు జోరు తగ్గింది అని చాలామంది భావిస్తున్నారు .అయితే నిజానికి శ్రీ లీల ఎన్నో భారీ ఆఫర్లకు నో చెబుతుందట. ఇంతకీ రీజన్ ఏంటో తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2024, 11:19 AM IST
Sreeleela: స్టార్ హీరో సినిమాకి సైతం నో చెప్పిన శ్రీలీల.. కారణం అదే!

Sreeleela in Pushp2: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. గత ఎడాది వరుసగా నాలుగు చిత్రాలలో నటించి మంచి ఆఫర్స్ తన ఖాతాలో వేసుకుంది.వీటిలో బాలయ్య తో చేసిన భగవంత్ కేసరి సూపర్ సక్సెస్ అందుకుంది. అయితే ఈ క్రెడిట్ మోతం బాలయ్య ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఇక శ్రీ లీల హీరోయిన్ గా చేసిన స్కంద,ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీస్ భారీ అంచనాల మధ్య విడుదలైన డిజాస్టర్స్ గా మిగిలాయి. అయితే ఈ మూవీస్ లో ఆమె యాక్టింగ్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి.

మొన్న సంక్రాంతికి మహేష్ బాబు సరసన గుంటూరు కారం చిత్రంలో శ్రీ లీల నటించింది. ఈ మూవీలో మహేష్ బాబుతో కలిసి శ్రీ లీల వేసిన డాన్స్ స్టెప్స్ కి మొత్తం థియేటర్ దద్దరిల్లింది. అయితే ఈ మూవీ తర్వాత శ్రీ లీల నుంచి నెక్స్ట్ మూవీ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఇక శ్రీ లీల కెరీర్ కు పెద్ద బ్రేక్ పడుతుంది అన్న వార్తలు ఎక్కువయ్యాయి. అయితే నిజానికి భారీ ఆఫర్లను కూడా శ్రీ లీల ఒక కారణం వల్ల వద్దు అని అనుకుంటుందట. ఇంతకీ ఆ కారణం ఏమిటో తెలుసా?

అల్లు అర్జున్ 'పుష్ప 2' లో ఓ స్పెషల్ సాంగ్ కోసం భారీ మొత్తంలో శ్రీలీలకు ఆఫర్ వచ్చింది. అయితే ప్రస్తుతం తన కెరీర్ ఉన్న సిచువేషన్ కి ఐటమ్ సాంగ్స్ చేయడం ఇష్టం లేక ఆమె ఈ ఆఫర్ ను తిరస్కరించింది అని టాక్. తాజాగా మరొక టాప్ హీరో మూవీలో కూడా వచ్చిన ఆఫర్ ని శ్రీలీల వద్దనుకుందట. శ్రీ లీల ఒప్పుకుంటే ఆమె అడిగిన పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు.అయినా కానీ శ్రీలీల ఈ ఆఫర్స్ ను  సున్నితంగా తిరస్కరించిందట. శ్రీ లీల యాక్టింగ్ తో పాటు తన ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.ఎమ్‌బీబీఎస్ పరీక్షల కోసం ఆమె ప్రస్తుతానికి మూవీస్ కి బ్రేక్ తీసుకుంది. ఎప్పుడో ఒప్పుకున్న పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్’తప్ప ప్రస్తుతానికి ఆమె మరింకే మూవీకి ఒకే చెప్పకపోవడానికి అదే కారణం.

Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..? 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News