KS Ravikumar Senational Comments: కోలీవుడ్ దర్శకుల్లో కే.యస్.రవికుమార్ కు ప్రత్యేక స్థానం ఉంది. తమిళంలో రజినీకాంత్ తో ముత్తు, నరసింహ వంటి బ్లాక్ బస్టర్స్ అందించాడు. చివరగా ఈయన సూపర్ స్టార్ తో ‘లింగ’ సినిమాను తెరకెక్కించాడు. అటు తెలుగులోను ఈయన చిరంజీవితో ‘స్నేహం కోసం’ సినిమాను తెరకెక్కించాడు. నాగార్జునతో ‘బావనచ్చాడు’, బాలయ్యతో ‘జై సింహా’తో పాటు రూలర్ సినిమాలను తెరకెక్కించాడు. ఇందులో ‘జై సింహా’ సినిమా మంచి విజయం అందుకుంది. కానీ ‘రూలర్’ మాత్రం బాక్సాఫీస్ ను రూల్ చేయలేక చతికిలి బడిపోయింది. అప్పట్లో ఈయన దర్శకుడిగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నపుడు బాలయ్య ఈయనకు పిలిచి మరి డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు. కానీ ఈయన తమిళనాడులో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో బాలయ్యకు కోపం ఎక్కువ. ఎవరినీ పడితే వాళ్లను ఎలాంటి కారణంగా లేకుండా కొడతాడని చెప్పి సంచలనం రేపాడు.
ఈ విషయంలో బాలయ్య అభిమానులు అప్పట్లో కేయస్ రవికుమార్ తీరుపై మండిపడ్డారు. అవకాశాలు లేని సమయంలో పిలిచి మరి మా హీరో మీకు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు సెట్స్ లో ఎవరైనా ఏదైనా తప్పుడు పనులు చేస్తే బాలయ్య అక్కడ ఎవరున్నారనే విషయాన్ని పట్టించుకోకుకండా వాళ్లపై కోప్పడ్డ సందర్భాలున్నాయి. కొన్ని విషయాల్లో తప్ప.. మా బాలయ్య.. ఎపుడు నిర్మాతలను యూనిట్ సభ్యులను రెమ్యునరేషన్ సహా ఇతరత్రా విషయాల్లో ఇబ్బందులు పెట్టిన సందర్బాలు లేవు. అంతేకాదు ఎంతో మంది పేదవాళ్లకు తన ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ద్వారా చికిత్స అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంతో పాటు రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందిస్తుంటారనే విషయాన్ని ప్రస్తావించారు.
తాజాగా ఈ దర్శకుడు రజినీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తమ కాంబినేషన్ లో వచ్చిన ‘లింగ’ సినిమా ఎడిటింగ్ విషయంలో రజినీకాంత్ జోక్యం చేసుకున్నారనే విసయాన్ని ప్రస్తావించారు. ఆ సినిమా అపజయంలో అది కీ రోల్ పోషించిందని చెప్పుకొచ్చారు. సినిమా సీజేఐ (కంప్యూటర్ గ్రాఫిక్స్) విషయంలో కూడా తనకు ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వలేదన్నారు. ఈ సినిమా సెకండాఫ్ మొత్తాన్ని మార్చేసారన్నారు. అనుష్కతో ఉండే ఓ పాటతో పాటు క్లైమాక్స్ లో ఉండే ట్విస్ట్ ను తొలిగించిన విషయాన్ని ప్రస్తావించారు. అందులో కృతకంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ ను యాడ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇపుడీ వ్యాఖ్యలు నెటింట వైరల్ గా మారాయి. మొత్తంగా ‘లింగ’ సినిమా ఫ్లాప్ కావడానికి రజినీకాంత్ ఇన్వాల్వ్ మెంట్ కారణం అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ సినిమాలో రజినీకాంత్ సరసన అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. అంతేకాదు ఈ సినిమా అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందన్నారు. ఓ రకంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అప్పట్లో బాలయ్య.. ఇపుడు రజినీకాంత్ లపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter