Tillu Square OTT Rights: సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'టిల్లు స్క్వేర్'. దాదాపు పదేళ్ల క్రితమే పరిచయమైన పెద్దగా బ్రేక్ రాలేదు. అప్పట్లో గుంటూరు కారం మూవీతో ఓ మోస్తరుగా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2022లో విడుదలైన టీజే టిల్లు మూవీతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఆ తర్వాత హీరోగా ఇతని రేంజ్ పెరిగింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీ ఈ రోజు విడుదలై బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. ఓవరాల్‌గా అన్ని చోట్ల టిల్లు బ్రాండ్‌తో ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. అటు బుక్ మై షోలో కూడా ఈ సినిమాకు టికెట్ బుక్ చేసుకునేవాళ్లు పెరిగుతున్నారు. అటు 10th, ఇంటర్ ఎగ్జామ్స్ కూడా పూర్తి కావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు.
టిల్లు స్క్వేర్ విషయానికొస్తే.. మొదటి పార్ట్ చూసినవారు రెండో పార్ట్‌కు కనెక్ట్ అవుతారు. ఇక డీజే టిల్లు మాదిరి మాత్రం ఈ సినిమా అంతగా మెప్పించలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ సినిమా మరి చెత్తగా లేదు... మరి కొత్తగా లేదనే వాదనలు ఆడియన్స్ నుంచి వస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ రైట్స్ ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 15 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ మాత్రం దాదాపు రూ. 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమాలో సిద్దు, అనుపమల మధ్య వచ్చే లిప్‌లాక్ సీన్స్ యూత్‌ను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. ఈ సినిమా కోసం సిద్దు దాదాపు రూ. 10 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సిద్దు జొన్నలగడ్డ కథ, స్క్రీన్ ప్లే అందిచారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. టిల్లు స్క్వేర్ సినిమాను సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్ సమర్పణలో ఈ సినిమా తెరకెక్కింది.
సిద్దు జొన్నలగడ్డ దాదాపు దశాబ్దం క్రితం నాగ చైతన్య హీరోగా నటించిన 'జోష్' మూవీతో వెండితెరకు పరిచయ్యాడు. ఆ తర్వాత 'గుంటూరు టాకీస్' మూవీలో తన యాక్టింగ్‌తో అదగొట్టాడు. మధ్యలో 'కృష్ణ అండ్ హీజ్ లీలా' మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 2022లో ఈయన రైటర్‌గా విమల్ కృష్ణ చేసిన 'డీజే టిల్లు' మూవీతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆ యేడాది బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాకుండా మంచి సక్సెస్ సాధించింది. ఇపుడీ మూవీకి సీక్వెల్‌గా 'టిల్లు స్క్కేర్' మూవీతో పలకరించాడు. ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: అంగరంగ వైభవంగా బర్రెలక్క రెండో వివాహం.. తరలివచ్చిన సోషల్ మీడియా అతిథులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook