Nagarjuna Takes COVID-19 Vaccine: పలు అంతర్జాతీయ దేశాలకు కరోనా వ్యాక్సిన్లు సైతం అందజేస్తోంది భారత్. కరోనా వైరస్‌పై తమ పోరాటాన్ని బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో రెండో దశలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ అగ్రనటులలో ఒకరైన ‘కింగ్’ అక్కినేని నాగార్జున కరోనా టీకా వేయించుకున్నారు.
కరోనాపై పోరాటంతో నేను సైతం అంటూ హీరో నాగార్జున మంగళవారం నాడు కోవిడ్-19 వ్యాక్సిన్ (COVID-19 Vaccine) తీసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ సైతం చేశారు. ‘నావంతుగా కరోనా టీకా వేయించుకున్నాను. అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను. ఇందుకోసం మీరు కొవిన్ యాప్(cowin.gov.in)లో వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండి. ఏ ఇబ్బంది లేకుండా టీకా పొందండి’ అని టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ట్వీట్ చేశారు.
Also Read: Mahesh Babu New Look: సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్, Photos ట్రెండింగ్
Got my #covaxin jab yesterday .. absolutely no down time👍😊I urge whoever is eligible to take the vaccine!!
You can now register for your #Covid19vaccine at https://t.co/Rm3ZUrv1Kx Book your vaccine. and get it done! #Unite2FightCorona#VaccineVarta@MoHFW_India @BMGFIndia pic.twitter.com/B4wjGoKLjx— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook