Patriotic songs: దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 బాలీవుడ్ పేట్రియాటిక్ సాంగ్స్

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతీయులలో దేశభక్తిని తట్టిలేపిన దేశభక్తి గీతాలపై ఓ లుక్కేద్దాం. సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేస్తోన్న సైనికులకు సైతం ప్రేరణ ఇచ్చే ఈ దేశభక్తి గీతాలు ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని రగిలిస్తాయి. అవేంటో మీరూ చూడండి.

Last Updated : Aug 15, 2020, 11:59 AM IST
Patriotic songs: దేశ భక్తిని తట్టిలేపే టాప్ 10 బాలీవుడ్ పేట్రియాటిక్ సాంగ్స్

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భారతీయులలో దేశభక్తిని తట్టిలేపిన దేశభక్తి గీతాలపై ఓ లుక్కేద్దాం. సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేస్తోన్న సైనికులకు సైతం ప్రేరణ ఇచ్చే ఈ దేశభక్తి గీతాలు ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని రగిలిస్తాయి. అవేంటో మీరూ చూడండి.

అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన కేసర్ సినిమా దేశభక్తిని ప్రోత్సహించే చిత్రాల్లో ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని తేరి మిట్టి ( Teri Mitti song from Kesar) అనే పాటకు ఆర్కో మ్యూజిక్ కంపోజ్ చేయగా ప్రముఖ గాయకుడు బి ప్రాన్ ఆలపించారు. 2019లో ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. సోషల్ మీడియాలో ఈ పాట పెను సంచలనం సృష్టించింది.

 

హాలీడే సినిమా ( Holiday movie ) కోసం ఇర్షాద్ కమిల్ రచించిన నైనా అష్క్ న హో ( Naina Ashq Na Ho song ) అనే పాట వింటే కన్నీళ్లు రావడం ఖాయం. సరిహద్దుల్లో యుద్ధానికి వెళ్లే సైనికులకు వారి కుటుంబసభ్యులు వీడ్కోలు పలికే దృశ్యాలతో మొదలయ్యే ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఏ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రీతం మ్యూజిక్ అందించగా ప్రముఖ సింగర్ అర్జీత్ సింగ్ అంతే అందంగా ఆలపించాడు.

 

పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్ ( Parmanu: The Story of Pokhran).. భారతీయులకు గుండెల నిండుగా దేశభక్తిని రగిల్చే సినిమాల్లో ఇది ఒకటి. ఈ సినిమాలో జాన్ అబ్రహం, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించగా.. అభిషేక్ శర్మ డైరెక్ట్ చేశారు. ఆయోరే శుభ్ దిన్ ఆయోరే అంటూ సాగే ఈ పాట వింటే మీలో ఉన్న దేశభక్తి రెట్టింపవడం ఖాయం.

 

కార్గిల్ యుద్ధం నేపథ్యంతో తెరకెక్కిన లక్ష్య ( Lakshya ) సినిమా సరిహద్దుల్లో సైనికుడి జీవితం ఎలా ఉంటుందని చూపించింది. ఈ సినిమాలో కంధోసే మిల్తే హై కంధే పాట ( Kandhon Se Milte Hain Kandhe ) చాలా ప్రత్యేకం. ఈ పాటకు శంకర్ ఎహ్సాన్ లాయ్ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. శంకర్ మహదేవన్, సోనూ నిగం, హరిహరన్, రూప్ కుమార్ రాథోడ్, కునాల్ గంజావాలా, విజయ్ ప్రకాశ్ పాట పాడారు. ఫరాన్ అక్తర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

 

అక్షయ్ కుమార్ నటించిన గోల్డ్ సినిమాలోని ( Gold movie ) జాగా హిందుస్థాన్ పాట ( Jaaga Hindustan song ) కూడా దేశభక్తిని తట్టిలేపే పాటల్లో ఒకటి. రీమా కగ్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు సచిన్ - జిగర్ ద్వయం మ్యూజిక్ అందించారు.

 

ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మా తుఝే సలాం పాట ( Maa Tujhe Salaam song ) గురించి ఇక పరిచయమే అక్కర్లేదు. ఇప్పటికే ఏళ్ల తరబడిగా భారతీయుల గుండెలోతుల్లో పాతుకుపోయిన దేశభక్తి గీతం ఇది.

 

షారుఖ్ ఖాన్ నటించిన స్వదేశ్ సినిమాలో ( Swadesh movie ) యే జో దేశ్ హై తేరా పాట కూడా పరిచయం అవసరం లేని దేశ భక్తి గీతం. విదేశాల్లో ఉన్న ఎన్నారైల ఆలోచనలు, పరిస్థితిని ప్రతిభింబించే ఈ పాట కూడా దేశభక్తిని ప్రోత్సహిస్తుంది.

 

చక్ దే ఇండియా ( Chak de India ).. ఆటల పోటీల్లో భారత క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే పాట. అంతేకాదు.. విజయం కోసం పరితపించే ప్రతీ భారతీయుడికి ఎంతో జోష్‌నిచ్చే పాట ఇది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను శిమిత్ అమిన్ డైరెక్ట్ చేయగా.. సలీం-సులైమన్ మ్యూజిక్ కంపోజ్ చేశారు.

 

రాజీ సినిమాలోని ఏ వతన్.. మేరే వతన్ పాట ( Ae Watan song ) కూడా మనలోని దేశ భక్తిని తట్టిలేపే గీతాల్లో ఒకటి. శంకర్ ఎహ్సన్ లాయ్ మ్యూజిక్ అందించిన ఈ ట్యూన్‌ని సునిధి చౌహన్ అంతే అందంగా పాడారు.

 

అమీర్ ఖాన్ నటించిన రంగ్ దే బసంతి మూవీలోని టైటిల్ ట్రాక్ ( Rang De Basanti song ) అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పుడైనా హిట్టే. ఎ.ఆర్. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాటను దలేర్ మెహందీ, కె.ఎస్. చిత్ర అందంగా ఆలపించారు.

 

Trending News