Truth Behind Kaikala Satyanarayana Death: తనదైన నటనతో నవరస నట సార్వభౌముడిగా పేరుతెచ్చుకున్న కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కైకాల మరణంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యానారాయణ మరణంకు కరోనా వైరస్ మహమ్మారి కారణం అని ఆయన కుటుంబ సభ్యులు చెపుతున్నారు. గతేడాది కైకాల సత్యానారాయణ కోవిడ్ బారిన పడ్డారని, అప్పటి నుంచి చాలా సిక్ అయ్యారని ఆయన సోదరుడు నాగేశ్వర్ రావు చెప్పారు. 'తెల్లవారుజామున కైకాల సత్యనారాయణ చనిపోయారు. గతేడాది ఆయన కోవిడ్ బారిన పడ్డారు. అప్పటి నుంచి చాలా సిక్ అయ్యారు. కొంతకాలంగా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.చలి కాలం కావడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఈరోజు ఉదయం కన్నుమూశారు' అని నాగేశ్వర్ రావు తెలిపారు.
'కైకాల సత్యనారాయణకు నలుగురు పిల్లలు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ముగ్గరు ఇక్కడే ఉన్నారు. ఒక కుమార్తె మాత్రం చెన్నైలో ఉంటుంది. ఈరోజు 11 గంటల నుంచి ఇంటి వద్ద అభిమానులు సందర్శనార్థం పార్ధీవ దేహం ఉంచుతాం. విదేశాల నుంచి వచ్చే బంధువులు కూడా ఉన్నారు. అందుకే రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తాం' అని కైకాల సత్యానారాయణ సోదరుడు నాగేశ్వర్ రావు చెప్పారు.
1935 జులై 25న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో కైకాల సత్యనారాయణ జన్మించారు. గుడివాడ కాలేజీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. చిన్నప్పటినుంచి నటనపై ఉన్న ఆసక్తితో స్కూల్, కాలేజీ చదువుతున్న రోజుల్లో ఎన్నో నాటకాలు, స్టేజ్ ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనలోని టాలెంట్‌ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించారు. దాంతో 'సిపాయి కూతురు' సినిమాలో కైకాలకు అవకాశం ఇచ్చారు. 61 సంవత్సరాల పాటు సినిమా రంగంలో ఉన్నా ఆయన దాదాపుగా 780 చిత్రాల్లో నటించారు.
Also Read: IPL 2023 Auction: నేడే ఐపీఎల్ 2023 మినీ వేలం.. వేదిక, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.