Upasana Konidela : ఉపాసన ఇంట్లో విషాదం.. మెగా కోడలి ఎమోషనల్ పోస్ట్

Upasana Konidela Grand Mother ఉపాసన కొణిదెల తాజాగా ఎమోషనల్ అయింది. తన గ్రాండ్ మదర్ మరణించినట్టుగా చెప్పింది. ఆమె ఉన్నన్ని రోజులు కూడా ఎంతో సంతోషంగా, ప్రేమను పంచుతూ ఉందని చెబుతూ ఎమోషనల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2023, 10:54 AM IST
  • నెట్టింట్లో ఉపాసన కొణిదెల ఎమోషనల్
  • గ్రాండ్ మదర్ మృతితో మెగా కోడలి కంటతడి
  • పిల్లలకు అదే అనుభూతి ఇవ్వాలంటోన్న ఉపాసన
Upasana Konidela : ఉపాసన ఇంట్లో విషాదం.. మెగా కోడలి ఎమోషనల్ పోస్ట్

Upasana Konidela Grand Mother Death  కామినేని ఇంట్లో విషాదం నెలకొంది. తన గ్రాండ్ మదర్ చనిపోయిందని ఉపాసన ఎమోషనల్ అవుతోంది. ఈ మేరకు మెగా కోడలు చేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది. ఆమె చివరి వరకు ఎంతో కృతజ్ఞత, సానుభూతి, గౌరవం, ప్రేమతో నిండిన జీవితాన్ని గడిపారు. ఆమె ద్వారానే జీవితాన్ని ఎలా జీవించాలో తెలుసుకున్నాను.. ఆమె నన్ను పెంచింది. నేను ఆమెను ఎప్పటికీ ప్రేమగా గుర్తుంచుకుంటాను. నా గ్రాండ్ పేరెంట్స్‌తో నేను అందుకున్న ప్రేమానుభవాలను నా పిల్లలకు కూడా అందేలా చూస్తానని మాటిస్తున్నాను అంటూ ఉపాసన ఎమోషనల్ అయింది

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

ఇప్పుడు ఉపాసన గర్భంతో ఉన్న సంగతి తెలిసిందే. ఉపాసన గర్భం దాల్చడంతో మెగా అభిమానులంతా కూడా ఫుల్ ఖుషీ అయ్యారు. రామ్ చరణ్‌ సోదరి సుష్మిత అయితే.. ఉపాసనకు కొడుకు పుట్టాలని కోరుకుంది. ఆల్రెడీ ఇంట్లో అందరూ అమ్మాయిలే ఉన్నారు.. చరణ్‌కు కొడుకు పుడితే బాగుంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఉపాసన గర్భం దాల్చడంతో కొందరు కొన్ని రూమర్లను పైకి తీసుకొచ్చారు. 

ఉపాసన సరోగసి ద్వారా పిల్లల్ని కంటోందనే రూమర్లు బయటకు వచ్చాయి. అయితే ఉపాసన మాత్రం అప్పుడప్పుడు తన బేబీ బంప్‌ను చూపిస్తూ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. అయితే ఉపాసన రామ్ చరణ్‌లు కలిసి ఈ సమయంలోనే ఎక్కువగా తిరుగుతున్నారు. మొన్నటి వరకు లాస్ ఏంజిల్స్‌లో సందడి చేశారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకల్లో భాగంగా రామ్ చరణ్‌ ఉపాసన ఇద్దరూ కలిసి రచ్చ చేశారు.

ఇక రామ్ చరణ్‌ తండ్రి కాబోతోన్నాడనే వార్తను ముందుగా చిరంజీవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఆంజనేయుడి ఆశీస్సులతో తమ ఇంటికి వారసుడు రాబోతోన్నాడంటూ చిరంజీవి మురిసిపోయాడు. పెళ్లై దశాబ్దం అవుతున్నా కూడా రామ్ చరణ్‌కు పిల్లలు లేకపోవడంతో అంతా పలు రకాలుగా మాట్లాడుకున్న విషయం తెలిసిందే.

Also Read:  Honey Rose Drinking : బాలయ్యతో కలిసి మందు కొడుతోందిగా.. హనీ రోజ్ యవ్వారం మామూలుగా లేదే

Also Read: Thaman Trolls : ఇక్కడ శివుడంటాడు.. అక్కడ చచ్చినా పర్లేదంటాడు.. తమన్ అతి డైలాగులపై సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News