Krithi Shetty belly dance: వామ్మో.. ఇదేం బెల్లీ డ్యాన్స్ బేబమ్మ... కుర్రాళ్లు తట్టుకోగలరా?

Krithi Shetty: ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి బెల్లీ డ్యాన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఈ అమ్మడు డ్యాన్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. మీరు ఓ లుక్కేయండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 11:35 AM IST
Krithi Shetty belly dance: వామ్మో.. ఇదేం బెల్లీ డ్యాన్స్ బేబమ్మ... కుర్రాళ్లు తట్టుకోగలరా?

Krithi Shetty belly dance video viral: ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. తొలి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృతికి ఆ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.  ఆదే ఊపులో బంగార్రాజు, శ్యామ్  సింగరాయ్ సినిమాలు చేసి మెప్పించింది. ఆ తర్వాత నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం, రామ్ పోతినేనితో వారియర్, నాగచైతన్యతో కస్టడీ చిత్రాల్లో నటించింది. అయితే ఆ సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీకి సినిమా ఛాన్స్ లు పెద్దగా రాలేదు. 

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో శర్వానంద్ సరసన ఓ సినిమా చేస్తోంది. మరోవైపు కోలీవుడ్ లో  లవ్ టుడే సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథ్ తో ఓ మూవీ సైన్ చేసింది. ఈ సినిమాకు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో మరో సినిమా కూడా చేస్తుంది కృతి. మలయాళంలో ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. 

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో కృతి శెట్టి ఒకరు. ఎప్పుడు లేటేస్ట్ ఫోట్ షూట్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది కృతి. తాజాగా ఈ బ్యూటీ బెల్లీ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. బీస్ట్ మూవీలోని అరబిక్ కుతు పాటకు సన స్నేహితురాలితో కలిసి బెల్లీ డాన్స్ ఇరగదీసింది. ఇందులో తన చిట్టి నడుమను తిప్పుతూ ఈ బ్యూటీ చేసిన స్టెప్స్ చూడటానికి రెండు కళ్లు చాలవు. బేబమ్మ డ్యాన్స్ చూసి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. బేబమ్మ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

Also Read: Rajinikanth Remuneration: నిమిషానికి కోటి... ఆశ్చర్యపరుస్తున్న రజనీకాంత్ రెమ్యూనరేషన్

Also Read: Eagle First Day Collections: ఈగల్ కి భారీ ప్రి-రిలీజ్ బిజినెస్.. మొదటి రోజు సాధించింది ఎంతంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News