గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి, తాను కాల్చుకున్న నటుడు

తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. కోపంలో జరిగే అనర్థాలు, నష్టం కూడా ఊహకు అందకుండా ఉంటుంది. అమెరికాలోని మేఫీల్డ్‌లోనూ అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అమెరికాలో బాస్కెట్స్ అనే టీవీ సిరీస్‌తో ( Baskets tv series ) ఫేమస్ అయిన నటుడు హాగెన్ మిల్స్ (29) ( Hagen Mills ) ఆవేశంలో తన గాళ్ ఫ్రెండ్ ఎరికా ప్రైస్ (34)ని ( Erica price ) తుపాకీతో కాల్చిచంపి.. ఆ తర్వాత తనను తాను అదే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.

Last Updated : May 21, 2020, 06:30 PM IST
గాళ్‌ఫ్రెండ్‌ని గన్‌తో కాల్చి, తాను కాల్చుకున్న నటుడు

తన కోపమే తన శత్రువు అంటారు పెద్దలు. కోపంలో జరిగే అనర్థాలు, నష్టం కూడా ఊహకు అందకుండా ఉంటుంది. అమెరికాలోని మేఫీల్డ్‌లోనూ అటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అమెరికాలో బాస్కెట్స్ అనే టీవీ సిరీస్‌తో ( Baskets tv series ) ఫేమస్ అయిన నటుడు హాగెన్ మిల్స్ (29) ( Hagen Mills ) ఆవేశంలో తన గాళ్ ఫ్రెండ్ ఎరికా ప్రైస్ (34)ని ( Erica price ) తుపాకీతో కాల్చిచంపి.. ఆ తర్వాత తనను తాను అదే తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ కలిపి ఓ పాప కూడా ఉంది. మిల్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎరికా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఎరికా అందించిన సమాచారంతో ఘటనస్థలికి చేరుకునేటప్పటికే ఆమె గాయాలపాలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. మిల్స్ అప్పటికే మృతి చెందాడు. ఎరికా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. ( Read also : నవాజుద్దీన్ సిద్ధిఖీకి విడాకుల నోటీసు )

తాను ఇంటికి చేరుకునేటప్పటికే మిల్స్ తన కూతురు, తల్లిని కూడా ఇంట్లో బంధీని చేశాడని ఎరికా పోలీసులకు ఇచ్చిన తన మరణ వాంగ్మూలంలో పేర్కొంది. బాస్కెట్స్ అనే టీవీ సిరీస్‌తో పాటు స్వెడిష్ డిక్స్ ( Swedish dicks ), ఇన్‌వాల్యుంటరిలీ సింగిల్ ( Involuntarily Single ) అనే టీవీ సిరీస్‌లలోనూ హెగెన్ మిల్స్ నటించాడు. ఒకట్రెండు సినిమాల్లోనూ నటించినప్పటికీ.. మిల్స్‌కి టీవీ నటుడిగానే మంచి గుర్తింపు లభించింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News