ప్రియదర్శి హీరోగా, కావ్యా కళ్యాణ్ రామ్ హీరోయిన్‌గా కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా బలగం. ఈ మూవీ రేపు (మార్చి 3) విడుదల కావాల్సి ఉంది. అయితే సినిమా మీదున్న నమ్మకంగా మేకర్లు ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేశారు. ఈ మూవీ ఎలా ఉంది? కథ, కథనాలు ఏంటి? దిల్ రాజు నమ్మకం రుజువైందా? అన్నది ఓ సారి చూద్దాం.
కథ
కొమురయ్య (సుధాకర్) ఊళ్లో తలలో నాలుకలా ఉంటాడు. అందరితో కలిసి మెలిసి ఉంటాడు. రోడ్డున వెళ్లే ప్రతీ ఒక్కరినీ పలకరిస్తుంటాడు. అతనికి ఐలయ్య (జయరామ్), మొగిలయ్య అనే ఇద్దరు కొడుకులుంటారు. లక్ష్మీ అనే కూతురు కూడా ఉంటుంది. కానీ కూతురు, అల్లుడితో మాటలు ఉండవు. కొమురయ్య మనవడే సాయిలు (ప్రియదర్శి). వ్యాపారం అంటూ అప్పులు చేస్తూ నష్టపోతుంటాడు. అలాంటి సాయిలు పెళ్లి చేసుకుని వచ్చిన కట్నంతో అప్పులు తీర్చాలని అనుకుంటాడు. కానీ అదే సమయంలో అనుకోకుండా కొమురయ్య మరణిస్తాడు. మరి సాయిలు తన అప్పు తీర్చాడా? దూరంగా ఉండే అత్త కుటుంబాన్ని, తన తండ్రికి ఎలా దగ్గర చేశాడు? అసలు రెండు కుటుంబాలకు మధ్య దూరం ఎందుకు పెరిగింది? చివరకు బలగం అంతా ఎలా ఒక్కటి అయింది? అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటులు
బలగం సినిమాలో ఎంత మంది ఆర్టిస్టులున్నా, ఎంతగా నటించినా కూడా కొంత మంది మాత్రం ఇట్టే గుర్తుండిపోతారు. కొమురయ్య పాత్ర మొదటి పదిహేను నిమిషాలు మాత్రమే ఉన్నా.. సినిమా అంతా ఆ పాత్ర చుట్టే తిరుగుతుంది. కొమురయ్య పాత్రకు సుధాకర్ న్యాయం చేశాడు. ఇక ఐలయ్యగా నటించిన జయరామ్ తన మొండితనాన్ని, పట్టుదల, కోపాన్ని, ప్రేమను అన్నింటిని ఒకే స్థాయిలో అద్భుతంగా చూపించాడు. సాయిలు పాత్రలో ప్రియదర్శి చివర్లో ఏడిపించేస్తాడు. సంధ్య పాత్రలో కావ్య కళ్యాణ్ రామ్ కనిపించినంత సేపు మెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ చక్కగా నటించింది. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. రచ్చ రవి చేసిన కామెడీ మాత్రం అందరినీ నవ్విస్తుంది. ఎప్పటిలానే రచ్చ రవి తెరపై కనిపించి రచ్చ రచ్చ చేసేశాడు. సినిమా ఆసాంతం నవ్వించేస్తూనే ఉంటాడు. ఇక మురళీధర్ గౌడ్, విజయలక్ష్మీ, కృష్ణ తేజ్ ఇలా అందరూ మెప్పిస్తారు.
విశ్లేషణ
చావు తతంగం చుట్టూ సినిమాను తీసి, అందులో అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించడం మామూలు విషయం కాదు. చెప్పాలనుకున్న విషయం, ఇవ్వాలనుకున్న సందేశాన్ని చావు చుట్టూ తిప్పి ఇవ్వడంలో వేణు దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా మాత్రమే కాకుండా తన మాటలతోనూ మెప్పిస్తాడు. అయితే వేణు ఈ సినిమాను పూర్తి తెలంగాణ సహజత్వాన్ని అద్దం పట్టేలా చిత్రీకరించాడు. తెలంగాణ యాస, ప్రాస, జీవన శైలిని తెరపై చక్కగా చూపించాడు.
సినిమాలోని పాత్రలో ప్రేక్షకుడు ప్రయాణించేలా చేయడంలో వేణు సక్సెస్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో పెద్ద ట్విస్టులేమీ ఉండవు. అలా మెల్లిగా సాగిపోతూ ఉంటుంది. కొందరికి ఈ సినిమా బోరింగ్‌గా కూడా అనిపించొచ్చు. కానీ తెలంగాణ నేటివిటీతో ఇట్టే కనెక్ట్ అవుతుంటారు. మన ఇంట్లోనే జరిగినట్టుగా కొన్ని సీన్లు కనిపిస్తాయి. అయితే ప్రథమార్థం అంతా కూడా సాఫీగా సాగుతుంది. అక్కడక్కడా నవ్వులు పూయిస్తూ ఉంటారు.
సెకండాఫ్‌కు వచ్చే సరికి కథ కాస్త సీరియస్ అవుతుంది. పంతాలు, పట్టింపులు, రాగ ద్వేషాలు, ప్రేమలు అనే ఎమోషన్స్ మాత్రం సినిమా ఆసాంతం చూపిస్తూనే ఉంటాడు వేణు. క్లైమాక్స్‌కు వచ్చే సరికి మాత్రం అందరినీ ఏడిపించేస్తాడు. బలగం అంటే కుటుంబం అంతా కలిసి ఉండటం.. అదే మన తల్లిదండ్రులకు ఇచ్చే ప్రేమ, గౌరవం.. బలగం ఉంటేనే బలం.. అని చెప్పాలనుకున్న సందేశం మాత్రం జనాలకు రీచ్ అవుతుంది.
బలగం సినిమాకు సంగీతం, పాటలు, ఆర్ఆర్ బలం. సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఊరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఎడిటింగ్, ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా అన్ని విభాగాలు చక్కగా కుదిరాయి. నిర్మాణ పరంగా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా అనిపిస్తుంది.
రేటింగ్ 3
చివరగా.. మన బలగం మన బలం
Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook