Vidya Malvade emotional After Being Unable to Cast Her Vote: దేశంలో ఈరోజు ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికలు ముగిశాయి. ఈ క్రమంలో ఉదయం నుంచి పెద్ద ఎత్తున అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకొవడానికి బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా తమ ఇళ్లనుంచి బైటకు వచ్చి ఓటును వేయాలని సందేశం ఇచ్చారు. ఓటు హక్కు అనేది మనకు రాజ్యంగం ఇచ్చిన ఒక ఆయుధంలాంటిది. దీన్నిఉపయోగించుకుని మనకు మంచి చేసే నాయకులను ఎన్నుకొవచ్చు. అందుకే ఎన్నికల సంఘం , ఎన్నికల నేపథ్యంలో అన్నిరకాల చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ కూడా ప్రజలను మందు, డబ్బులతో ప్రలోభాలకు గురిచేయకుండా కూడా చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో పోలీసులు కూడా పకట్భందీ చర్యలు చేపడుతుంటారు. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉంటారు.
ఇదిలా ఉండగా.. ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఓటర్లకు ఊహించని ఘటనలు ఎదురౌతుంటాయి. కొన్నిసార్లు పేరు సరిగ్గాలేదని, ఒక బూతుకు బదులు మరో పోలింగ్ బూత్ లో వీరి పేరు ఉంటుంది. ఇక.. పోలీంగ్ సిబ్బంది ఏమాత్రం అనుమానం వచ్చిన కూడా ఓటు వేయడానికి అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వరు. ఇదిలా ఉండగా.. ఈరోజు తన ఓట హక్కును వినియోంచుకునేందుకు వెళ్లిన బాలీవుడ్ నటి విద్యా మాల్వేడేకి చేదు అనుభవం ఎదురైంది. ఓటింగ్ లిస్ట్ లో ఆమె పేరు గల్లంతయినట్లు తెలుస్తొంది.
పూర్తి వివరాలు..
దేశంలో ఐదవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో రాజకీయ నేతలు, ప్రముఖులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇదిలా ఉండగా.. బాలీవుట్ నటి విద్యా మాల్వేడే కూడా తన ఓటు హక్కును వినియోంచుకునేందుకు పోలింగ్ బూత్ కు వెళ్లారు. తన తల్లిదండ్రుల ఓట్లు ఉన్నాయి. కానీ ఆమె పేరు మాత్రం అక్కడ లిస్ట్ లో లేదు. దీంతో ఆమెఖంగుతిన్నారు. దాదాపు మూడు గంటల పాటు అక్కడే వేచీ చూశారు. ఏ లిస్ట్ లో కూడా ఆమె పేరు కన్పించలేదు. దీంతో ఆమె తీవ్రనిరాశకు లోనయ్యారు. తన ఇంటికి చేరుకుని ఎక్స్ వేదికగా తన బాధను పంచుకున్నారు.
Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..
కొన్నేళ్లుగా తాము బాంబేలో ఉంటున్నామని నా ఓటు ఎక్కడికి పోయిందని ఆమె అధికారులను ప్రశ్నించారు. ఓటరు నమోదు కోసం వచ్చినప్పుడు తన పేరు, తన ఫ్యామిలీ డిటైల్స్ ఇచ్చానంటూ గుర్తు చేసుకున్నారు. ఇలా జరగటం చాలా బాధగా అనిపిస్తుందంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నా డ్యూటీని నేను చేయలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు. గంటల కొద్ది క్యూలో నిలబడి చివరకు ఓటు వేయకుండానే ఇంటికి రావడం చాలా బాధగా ఉందని విద్యా మాల్వేడే అన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter