Vijay - Mega Family: హీరో విజయ్.. ప్రస్తుతం తమిళంలో అగ్ర కథానాయికుడిగా దూకుడు చూపిస్తున్నాడు. అంతేకాదు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలో తన పార్టీతో కలిసి రంగంలోకి దిగబోతున్నాడు. అంతేకాదు హీరో అయ్యాకా.. తన జీవితం ప్రజా జీవితానికికే అంకితం అని చెబుతున్నారు. అందుకే చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇక మెగాఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే.. ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన చిరంజీవి.. అంచలంచెలుగా ఎదిగి పద్మవిభూషణ్ స్థాయి అందుకున్నారు. ఇక విజయ్.. తన తండ్రి ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వంలో యాక్టింగ్ లో ఓనమాలు నేర్చుకున్నాడు. మరోవైపు విజయ్.. తనకు తెలుగులో చిరంజీవి అంటే అభిమానం పలు సందర్బాల్లో ప్రస్తావించారు. ఈయనకు మెగా ఫ్యామిలీకి మధ్య ఓ రిలేషన్ ఉంది.
విజయ్ తండ్రి ప్రముఖ ఎస్.ఏ. చంద్రశేఖర్.. తమిళంలో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు గడించాడు. ముఖ్యంగా రజినీకాంత్, విజయ్ కాంత్ లతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి వాళ్లకు మాస్ లో ప్రత్యేక గుర్తింపు తేవడంతో ఎస్.ఏ.చంద్రశేఖర్ సినిమాలు కీ రోల్ ప్లే చేశాయి. ఇక విజయ్ తండ్రి .. ఎస్.ఏ. చంద్రశేఖర్.. చిరంజీవితో ‘చట్టానికి కళ్లులేవు’, ‘పల్లెటూరి మొనగాడు’, ‘దేవాంతకుడు’ వంటి సినిమాలను తెరకెక్కించాడు. అటు చిరంజీవితో కాకుండా పలువురు తెలుగు హీరోలతో సినిమాలను డైరెక్ట్ చేసిన ఘనత ఎస్.ఏ.చంద్రశేఖర్ ది.
అంతేకాదు హిందీలో కూడా పలువురు హీరోలతో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆ సంగతి పక్కనపెడితే.. చిరంజీవి రాజకీయాల్లో వెళ్లి.. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేసిన ‘ఖైదీ నంబర్ 150’ సినిమా.. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘కత్తి’ మూవీకి రీమేక్. అంతేకాదు విజయ్ హీరోగా తమిళంలో హిట్టైన లవ్ టుడే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్.. ‘సుస్వాగతం’ పేరుతో రీమేక్ చేసారు. అటు ఖుషీ మూవీని ‘ఖుషీ’ టైటిల్ తో పవన్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అటు విజయ్ హీరోగా తమిళంలో తెరకెక్కిన ‘తిరుపాచ్చి’ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ‘అన్నవరం’ పేరుతో రీమేక్ చేశారు.
మరో విశేషం ఏమిటంటే.. ఈయన పవన్ నటించిన ఓ సినిమాను తమిళంలో రీమేక్ చేసాడు అదే తమ్ముడు. ఈ సినిమాను తమిళంలో ‘బద్రి’ టైటిల్ తో రీమేక్ చేయడం విశేషం. మొత్తంగా ఈయన సినిమాలను మెగా హీరోలు రీమేక్ చేయడంతో పాటు ఆయన ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలో దర్శకత్వంలో చిరంజీవి నటించడం వంటివి ఉన్నాయి. మరోవైపు చిరంజీవి బర్త్ డే ఆగష్టు 22 అయితే.. విజయ్ బర్త్ డే జూన్ 22.. మరోవైపు పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2.. ఈ రకంగా వీళ్లు పుట్టిన రోజు అంకెలు కూడా కలవడం పెద్ద విచిత్రమనే చెప్పాలి. అంతేకాదు చిరు, పవన్ కళ్యాణ్ బాటలోనే విజయ్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయడం కొసమెరుపు.
Also Read: Kodali nani: మాజీ మంత్రి కొడాలి నానికి మరో బిగ్ షాక్.. గుడివాడలో కేసు నమోదు.. అసలేం జరిగిందంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter