Vijay:విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ సినిమా విడుదల వరకు ఈ సినిమాపై పెద్దగా హోప్స్ లేవు. విడుదల తర్వాత ఎక్కువగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. తెలుగు, కేరళ, హిందీ ప్రేక్షకులు ఈ సినిమాను లైట్ తీసుకున్న తమిళ ప్రేక్షకులు ఈ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్ ఈ సినిమా వీర విహారం చేసింది. గురువారం విడుదలైన ఈ సినిమా ఓ హాలీవుడ్ మూవీకి ప్రీ మేక్ అని టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ల ఊచకోత కోసం మొత్తంగా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో దుమ్ము రేపింది.
మొత్తంగా మూడు రోజుల్లో రూ. 200 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టిన ఈ సినిమా తాజాగా నిన్నటితో రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించి బాక్సాఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసింది. ఇక విజయ్ కెరీర్ లో ‘గోట్’ మూవీ రూ. 200 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన 8వ చిత్రంగా నిలిచింది.
గతంలో విజయ్ నటించిన మెర్సల్ మూవీతో తొలిసారి రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసాడు. ఆ తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో చేసిన ‘సర్కార్’, బిగిల్, మాస్టర్, బీస్ట్, వారిసు ఆ తర్వాత లియో చిత్రాలు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. తాజాగా ‘గోట్’ మూవీ విజయ్ కెరీర్ లో రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన 8వ చిత్రంగా రికార్డులకు ఎక్కింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో మరే హీరో సినిమాలు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించలేదు. మొత్తంగా ప్రభాస్ కూడా బాహుబలి తర్వాత బాహుబలి 2, సాహో, ఆదిపురుష్, సలార్,కల్కి కలిపితే ఆరు చిత్రాలే రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. అటు రజనీకాంత్ చిత్రాలు ఆరు రూ. 200 కోట్ల క్లబ్బులో ప్రవేశించాయి. కానీ విజయ్ నటించిన ‘గోట్’తో కలిపితే మొత్తంగా 8 చిత్రాలు రూ. 200 కోట్ల క్లబ్బులో చేరడం విశేషం. మొత్తంగా నెగిటివ్ టాక్ తో విజయ్ ఈ రేంజ్ లో వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదు.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
Vijay: సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయ్ రేర్ రికార్డు.. ప్రభాస్ సైతం అల్లంత దూరంలో..