Vishnu Manchu announces medical benefits for MAA members: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు.. మా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే కార్యాచరణ మొదలు పెట్టారు. మొదటగా.. మా.. మెంబర్స్ హెల్త్‌పై దృష్టి సారించాడు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్స్‌తో ఒప్పందం చేసుకున్నారు.
ప్రతి మూడు నెలలకొకసారి ఫ్రీ మెడికల్ క్యాంపులను (Free medical camp) ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యబీమా (Health insurance) క్లెయిమ్ కంటే ఎక్కువ ఖర్చు అయితే.. ఆ బిల్లులోనూ రాయితీ ఇవ్వన్నట్లు తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో ‘మా’ సభ్యుల కోసం ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు.
మా.. మహిళా మెంబర్స్ ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి ట్రీట్‌మెంట్ కోసం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ (Cancer), సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు మంచి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేసినట్లు మా అధ్యక్షుడు విష్ణు వెల్లడించారు.ఇక.. మా మెంబర్స్‌కు ప్రత్యేకంగా చికిత్స అందించి, బిల్లులో రాయితీలు (Discounts) కల్పిస్తున్న డాక్టర్స్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపామని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
Also Read : Rape in Madhya Pradesh: 62 ఏళ్ల వృద్దురాలిపై 75 ఏళ్ల వృద్దుడి అత్యాచారం...
మా... మెంబర్స్ హెల్త్ టెస్ట్‌లకు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీ ఇస్తామని ప్రకటించిన టెనెట్ డయాగ్నస్టిక్స్ మేనేజ్‌మెంట్ సురేశ్, చరణ్‌లకు మంచు విష్ణు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని (Hyderabad) ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ హాస్పిటల్స్‌తో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ (Free ambulance) సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే మా సభ్యులు వారి ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలను ఈ ఆసుపత్రుల్లో ఉచితంగానే చేయించుకోవచ్చని వెల్లడించారు.
అంతేకాకుండా వైద్యనిపుణులతో ముఖాముఖీ మాట్లాడటంతో పాటు వీడియో కన్సల్టెంట్ ద్వారా కూడా సంప్రదించవచ్చని సూచించారు. అసోసియేషన్‌లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని విష్ణు చెప్పారు. డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు (Vishnu Manchu) తెలిపారు.
Also Read : Headmaster : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ హెడ్మాస్టర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook