Aggressive King Cobra Bite a innocent Women: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. కొన్ని వైరల్ అవుతుంటాయి. ఇంకొన్ని ఆసక్తి రేపుతుంటాయి. అలాంటిదే ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవడమే కాకుండా భయం గొలుపుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చాలా భయం కల్గిస్తోంది. 12 అడుగుల కింగ్ కోబ్రా ఎంత ఆగ్రహంగా ఉందో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఎక్కడిదో తెలియదు కానీ..నిజంగా జరిగిన ఈ ఘటన ఒళ్లు జలదరించేస్తుంది. ఆ బ్లాక్ కోబ్రాను పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించారో..కాటేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించిందో చూస్తే భయంతో వణికిపోతారు.
ఈ వీడియోలో ఇద్దరు మహిళలు పనిచేసుకుంటున్నారు. అక్కడున్న చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తుంటారు. అంతలో ఒక్కసారిగా ఆ చెత్తలో దాక్కున్న 12 అడుగుల నల్లటి కింగ్ కోబ్రా ఓ మహిళ చేతిపై కాటేసింది. పాము కాటేయడంలో ఆ అమ్మాయి కేక పెడుతూ పడిపోతుంది. అక్కడున్న మిగిలివాళ్లు..వెంటనే ఆ అమ్మాయికి సపర్యలు చేస్తారు. విషం పైకి పాకకుండా మోచేతి వద్ద తాడుతో గట్టిగా బిగించి కడతారు.
మరోవైపు ఆ చెత్తలో దాక్కున్న కింగ్ కోబ్రాను పట్టుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆ పామును బయటకు లాగుతారు. తోక పట్టుకుని లాగుతుంటే..భయంకరమైన కోపంతో రగిలిపోతున్న ఆ కింగ్ కోబ్రా కాటేసేందుకు చాలాసార్లు ప్రయత్నిస్తుంది. ఎగిరెగిరి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. చాలాసార్లు ఆ పాము కాటు నుంచి తప్పించుకుని..మొత్తానికి ఓ సంచిలో ఆ కింగ్ కోబ్రాను బంధించగలుగుతారు.
Also read: King Cobra Nest Viral Video: కింగ్ కోబ్రా గూడు కట్టుకుంటుంది.. నమ్మడం లేదా! ఈ వీడియో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook