సినీ ధ్రువతార నేలరాలింది. సినీప్రపంచం మూగబోయింది. శ్రీదేవి(54) మరణంతో దేశం షాక్ కు గురయ్యింది. అతిలోక సుందరి మృతిపట్ల సినీప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. తెలుగు , హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ తదితర సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు శ్రీదేవి మృతిపట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ నటి శ్రీదేవి హఠాత్తుగా చనిపోయిన వార్తవిని తమిళ సూపర్ స్టార్లు రజినీకాంత్, కమల్ హాసన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శ్రీదేవితో అనేక హిట్ చిత్రాలలో నటించిన ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ట్విట్టర్ లో వేరువేరుగా ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
"నేను ఆశ్చర్యపోయాడు, కలత చెందాను. నేను ఒక డియర్ ఫ్రెండ్ ను కోల్పోయాను. పరిశ్రమ నిజమైన లెజెండ్ ను కోల్పోయింది. తన కుటుంబానికి, సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. నేను వారిలాగే బాధపడుతున్నాను #రిప్ శ్రీదేవి... యు విల్ బి మిస్డ్," అంటూ ట్విట్టర్ లో తలైవర్ పేర్కొన్నారు.
I’m shocked and very disturbed. I’ve lost a dear friend and the industry has lost a true legend. My heart goes out to her family and friends. I feel the pain with them #RIPSridev ... you will be missed.
— Rajinikanth (@superstarrajini) February 25, 2018
వసంత కోకిల సినిమాలో చిన్న పాపలా, తల్లిలా తనను ఆడించిన నాకు.. శ్రీదేవి మరణవార్త జీర్ణించుకోలేనిదని కమల్ హాసన్ అన్నారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Have witnessed Sridevi's life from an adolescent teenager to the magnificeint lady she became. Her stardom was well deserved. Many happy moments with her flash through my mind including the last time I met her. Sadma's lullaby haunts me now. We'll miss her
— Kamal Haasan (@ikamalhaasan) February 25, 2018
శ్రీదేవి సినీప్రస్థానం తమిళ సినిమాలో బాలనటిగా మొదలైంది. 13 ఏళ్ళ వయసులో ఆమె కె బాలచందర్ 'మూండ్రు ముడుచు' (1976) చిత్రంలో కమల్ హాసన్, రజినీకాంత్ లతో కలిసి నటించారు.
శ్రీదేవి, రజినీకాంత్ చాలా విజయవంతమైన చిత్రాలలో నటించారు. కానీ కమల్ హాసన్ తో చాలా ఎక్కువ సినిమాలలో నటించారు. వీరిద్దరూ కలిసి దాదాపు 30 చిత్రాలలో నటించారు.
హిందీ సినిమాలో తొలి మహిళా సూపర్ స్టార్ గా అభివర్ణించే శ్రీదేవి(54) శనివారం రాత్రి గుండెపోటు కారణంగా మరణించారు.