సోమవారం ముంబైకి చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

దుబాయ్‌లోని అల్‌ఖసిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో  శ్రీదేవి భౌతికకాయం

Last Updated : Feb 26, 2018, 12:56 AM IST
సోమవారం ముంబైకి చేరుకోనున్న శ్రీదేవి భౌతికకాయం

దుబాయ్‌లో కన్నుమూసిన నటి శ్రీదేవి భౌతికకాయం సోమవారం ఉదయం ముంబైకి ‌చేరుకోనుంది. శ్రీదేవి దుబాయ్‌లో చనిపోయిన అనంతరం ఆమె భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తయినప్పటికీ.. చట్టరీత్యా దౌత్యపరమైన కారణాలతో ఆమె భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకి అప్పగించడంలో ఆలస్యం అవుతుందని దుబాయ్‌లో వున్న ఇండియన్ కాన్సులెట్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం శ్రీదేవి భౌతికకాయం దుబాయ్‌లోని అల్‌ఖసిస్ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో వుంది. ఫోరెన్సిక్ నివేదిక అందాకే దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. ఆమె భౌతికకాయం ముంబై చేరుకోగానే ప్రముఖులు, అభిమానుల సందర్శన తర్వాత ముంబైలోని జూహూ శాంతాక్రాజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తిచేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ముంబైలో వున్న ఆమె సమీప బంధువులు ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

 

శ్రీదేవి భర్త బోనీకపూర్ సోదరి కుమారుడు మోహిత్ మర్వ వివాహం కోసం శ్రీదేవి దుబాయ్ వెళ్లారు. మూడు రోజుల క్రితమే ఈ వివాహం జరిగింది. ఆ తర్వాత భర్త బోనీ కపూర్, చిన్న కూతురు ఖుషీ కపూర్‌లతో కలిసి జుమెరియా ఎమిరేట్స్ టవర్స్‌ హోటల్‌లో బస చేశారామె. రాత్రి 11గంటలకు వాష్ రూమ్ లో కుప్పకూలిపోయిన శ్రీదేవి గుండెనొప్పితో అకస్మారక స్థితిలోకి వెళ్లిందని, వెంటనే సమీపంలోని రషీద్ ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే ఆమె చనిపోయారని వైద్యులు తేల్చిచెప్పినట్టు సమాచారం. 

Trending News