Tammareddy Bharadwaj on Oscar Award for Naatu Naatu: కొద్దిరోజుల క్రితం ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేసేందుకు దాదాపు 80 కోట్లు ఖర్చుపెట్టినట్లు తనకు తెలిసిందని ఆ 80 కోట్లు తన దగ్గర ఉంటే ఎనిమిది చిన్న సినిమాలు తీసి మీ మొఖాన కొడతానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ మీద నాగబాబు అదే విధంగా రాఘవేంద్రరావు వంటి వారు సైతం తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
తమ్మారెడ్డి భరద్వాజ తాను అన్న మాటలు అవి కావని తాను అన్న సందర్భం వేరు బయటకు వచ్చిన మాటలు వేరు తనకు ఎవరునీ కించపరచాలని ఉద్దేశం లేదని కామెంట్లు చేశారు. అయితే ఈరోజు ఆస్కార్ అవార్డులు వేదిక మీద నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిందని తెలిసిన వెంటనే సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు చెబుతూనే చాలామంది తమ్మారెడ్డి భరద్వాజ మీద విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. నీలా ఇంటికి పరిమితమై యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇంత క్రేజ్ దక్కేదా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఇవేవీ పట్టించుకోకుండా తమ్మారెడ్డి భరద్వాజ సినిమా యూనిట్ ని ప్రశంసిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. కీరవాణి గారు ఆస్కార్ అందుకోవటం నాకు వచ్చినంత ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నేను కుటుంబంలో పెద్దగా ప్రమోషన్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని మాట్లాడాను, నిజానికి నేను అన్న సందర్భం వేరు జాగ్రత్తలు చెప్పాను తప్ప వేరే ఉద్దేశం లేదు అయినా మా వాళ్లకు పేరు ప్రతిష్ట వస్తున్నాయంటే నాకన్నా ఆనందపడేవాడు ఎవడు ఉండడు.
నాకు మా కుటుంబం మా మధ్యలో ఎవడో వేలు పెట్టి ఏదో లబ్ధి పొందాలని చూసినా మా కుటుంబంలో ఎవరూ పట్టించుకోరు, నా గురించి వాళ్లకు తెలుసు మా వాళ్లకు ఆస్కార్ వచ్చింది. మరొక్కసారి రాజమౌళికి కీరవాణి గారికి చంద్రబోస్ కు మరియు ఆర్ఆర్ఆర్ టీం కి అభినందనలు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్లు చేశారు. మరి ఈ విషయం మీద నాగబాబు అలాగే మిగతావారు ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: Hero Raviteja Harrasment: హీరోయిన్లు, ఐటెం గాళ్స్ మీద రవితేజ అరాచకం.. ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు!
Also Read: Vijay Devarakonda- Samantha: రష్మికతో బ్రేకప్..సమంతతో టైం పాస్ లవ్లో విజయ్ దేవరకొండ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook