నకిలీ ఖాతాలపై ట్విటర్‌ కొరడా.. ప్రముఖులపై ఎఫెక్ట్

                                    

Last Updated : Jul 13, 2018, 05:01 PM IST
నకిలీ ఖాతాలపై ట్విటర్‌ కొరడా.. ప్రముఖులపై ఎఫెక్ట్

నకిలీ ఖాతాలపై ట్విట్టర్ కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధమైంది. అనుమానాస్పద ఖాతాలను తొలగింపు ప్రక్రియ ట్విట్టర్ సంస్థ శ్రీకారం చుట్టింది. నకిలీ ఖాతాలే లక్ష్యంగా ఈ చర్యలు మొదలుపెట్టినట్లు ట్విటర్‌ సంస్థ ఓ ప్రకటన విడుదలచేసింది.  ట్విటర్‌ను మరింత మెరుగుపరిచేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ పేర్కొంది. ఈ చర్యతో ఫాలోవర్స్ సంఖ్యపై టిట్విర్ ఖాతాదారుల్లో విశ్వాసం పెంచేందుకు ఇది దోహదపడుతుందని ట్విట్టర్ సంస్థ పేర్కొంది.

తగ్గిపోనున్న ప్రముఖల ఫాలోవర్స్

ట్విట్టర్ తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రముఖలు అనుచరుల ఖాతాలకు భారీ కోత పడనుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం నకిలీ ట్విట్టర్ ఖాతాలు తొలగింపులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు 5.34 కోట్ల మంది అనుచరుల్లో లక్ష వరకు నకిలీ ఖాతాలని తేలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా 10.4 కోట్ల మంది అనుచరుల్లో  నాలుగు లక్షల వరకూ కోతపడింది.

ఇక భారత్ విషయానికి వస్తే  ప్రధాని మోడీ (60 శాతం నకిలీ ఫాలోవర్స్  ), రాహుల్ ( 67  శాతం నకిలీ ఫాలోవర్స్),  బీజేపీ చీఫ్ అమిత్ షాతో పాటు  పలువురు రాజకీయ, సినీ ప్రముఖలకు నకిలీ ఫాలోవర్స్ సంఖ్య భారీగా ఉన్నట్లు గతంలో ట్విట్టర్ సంస్థ తేల్చింది. తాజా నిర్ణయంతో వీరి ఫాలోవర్స్ పై కూడా భారీగా కోత పడే అవకాశముంది.

Trending News