భారత్ vs పాక్ నేపథ్యంలో.. 2016 సెప్టెంబర్ 18న జరిగిన యురి ఘటన, అనంతరం పాకిస్తాన్‌పై ప్రతీకార చర్యగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దాడులు వంటి యధార్ధ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న హిందీలో యురి అనే పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆదిత్య ధర్ అనే దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విక్కీ కౌశల్, యామీ గౌతం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రోని స్క్రూవాలా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న రివీజ్ కానుండగా తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. యురి ఘటనలో 19 మంది భారతీయ సైనికులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌తో ప్రతీకారం తీర్చుకున్న వైనాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేశారని ఈ టీజర్‌ని చూస్తే అర్థమవుతోంది.