Diabetic Superfoods: ఈ 7 డయాబెటిక్ పేషెంట్లకు సూపర్ ఫుడ్స్ డైట్ లో ఉంటే మధుమేహం మాయం..

7 Diabetic Superfoods: డయాబెటిక్ రోగులు తీసుకోవాల్సిన ఆహారాలపై జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్‌గా తీసుకునే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుతాయి.. అంతేకాదు డయాబెటీస్ రోగులు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోవడం ఎంతో మంచిది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరగకుండా ఉంటాయి. లేకపోతే ప్రాణాంతక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే డయాబెటిస్ పేషంట్లకు సూపర్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం .

Written by - Renuka Godugu | Last Updated : Jan 17, 2025, 04:08 PM IST
Diabetic Superfoods: ఈ 7 డయాబెటిక్ పేషెంట్లకు సూపర్ ఫుడ్స్ డైట్ లో ఉంటే మధుమేహం మాయం..

7 Diabetic Superfoods: డయాబెటీస్‌ రోగులు కొన్ని సూపర్‌ ఫుడ్స్‌ వారి డైట్‌లో చేర్చుకోవాలి. ఇవి సులభంగా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. ఇవి వారికి ఆరోగ్యానికి వరం కాబట్టి షుగర్‌ వ్యాధిగ్రస్థులు తినాల్సిన ఆహారం తెలుసుకుందాం..

కొవ్వు చేపలు..
డయాబెటిస్ కు రోగులకు కొవ్వు చాపలు ఎంతో మంచిది ఇది సాల్మన్, మెకరెల్‌, సార్డినైన్‌ వంటి చేపలు డైట్లో చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఎస్ ఉంటుంది. ఇది మంట సమస్యను వాపును తగ్గిస్తుంది.. అంతేకాదు ఇది గుండె సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు ఈ చేపలు డైట్‌లో చేర్చుకోవాలి.

తృణధాన్యాలు..
డయాబెటిస్ రోగులు ముఖ్యంగా క్వినోవా, ఓట్స్, బార్లీ వంటి ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు తినాలి. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటాయి. హఠాత్తుగా చక్కెర స్థాయులు పెరగకుండా ఉంటాయి.

గింజలు..
డయాబెటిస్ రోగులు ముఖ్యంగా కొన్ని రకాల గింజలు వాళ్ళు డైట్ లో తప్పనిసరి ఉండాలి. రాత్రి నానబెట్టి ఉదయం వాటిని తినాలి. ముఖ్యంగా వాల్నట్స్, బాదం, పిస్తా వంటివి తీసుకోవడం వల్ల ఇవన్నీ ఆరోగ్యకరమైన కొవ్వులు కాబట్టి శరీరానికి శక్తి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా ఉంటాయి.. ఇందులో ఆరోగ్యకరమైన పువ్వులతో పాటు ఫైబర్ ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. కడుపు నిండిన అనుభూతిని కూడా ఎక్కువ సమయం పాటు కల్పిస్తుంది.

యోగర్ట్‌..
డయాబెటిస్ రోగులు ప్రోటీన్ పుష్కలంగా ఉండే డైరీ పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగనివ్వని ఆరోగ్యకరమైన గ్రీక్‌ యోగర్ట్‌ డైట్లో చేర్చుకోవాలి.

చిలగడదుంప..
చిలగడ దుంపలో గ్లైసమిక్ సూచి తక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగనివ్వవు. డయాబెటిస్ రోగులకు మంచివి. ఇందులో ఖనిజాలు పుష్కలం రోజంతటికి కావలసిన శక్తి కూడా చిలకడదుంప అందిస్తుంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

బీన్స్..
ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉండే బీన్స్ కూడా డయాబెటిస్ రోగులు డైట్లో చేర్చుకోవాలి. ఇది తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది.. అతిగా ఆకలి వేయదు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఈ బీన్స్ ఆరోగ్య కరం కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా డైట్లో చేర్చుకోవాలి.

ఇదీ చదవండి:  ఆధార్‌ కార్డ్‌ ఉంటే చాలు.. ఏ గ్యారంటీ లేకుండా రూ.50,000 మీ ఖాతాల్లో జమా..!  

బెర్రీ పండ్లు..
డయాబెటిస్ రోగులు బ్లూబెర్రీ, రాస్బెర్రీ వంటి బెర్రీ పండ్లు డైట్‌లో చేర్చుకోవాలి. ఎక్కువ స్ట్రాబెరీలు మార్కెట్లో కనిపిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగవు ఈ పండ్లు తినాలి.

ఇదీ చదవండి: మీ చర్మం నిత్య యవ్వనంగా కనిపించేలా ప్రేరేపించే 6 డ్రింక్స్.. తాగితే మ్యాజికల్‌ బెనిఫిట్స్‌..

చియా సీడ్స్..
చియా సీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయులను పెరగకుండా కాపాడతాయి. ఇది మంట, వాపు సమస్యను తగ్గిస్తుంది. అంతే కాదు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన అనుభూతి కల్పిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News