Cancer Treatment: కేన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. అత్యంత ఖర్చుతో కూడుకున్న చికిత్స. కేన్సర్ చికిత్స అంటే ప్రతి ఒక్కరికీ భయమే. అయితే కేన్సర్ చికిత్సను అతి తక్కువ ఖర్చులో చేయవచ్చని బ్రిటన్ పరిశోధనల్లో వెల్లడైంది.
ప్రపంచంలో ఇప్పుడు కేన్సర్(Cancer) సాధారణంగా మారిపోయింది. కేన్సర్ వ్యాధి గ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిత్య జీవితంలో వస్తున్న మార్పులు కావచ్చు, కాలుష్యం కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు. కారణాలేమైనా కేన్సర్ వ్యాధి కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కేన్సర్ చికిత్స అతి ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలామంది కేన్సర్ చికిత్స చేయించుకునేందుకు భయపడే పరిస్థితి. ఈ నేపధ్యంలో బ్రిటన్ నుంచి గుడ్‌న్యూస్ విన్పిస్తోంది. బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్వహించిన పరిశోధనల్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. సామాన్యుడు సైతం వైద్యం చేయించుకోగలిగే రీతిలో సరికొత్త చికిత్సా విధానాన్ని తీసుకొచ్చింది.
ఎన్‌హెచ్‌ఎస్ ప్రపంచవ్యాప్తంగా గ్యాలరీ రక్త పరీక్షకు సంబంధించిన అతి పెద్ద పరిశోధనలు చేపట్టింది. క్యాన్సర్ లక్షణాలు(Cancer Symptoms)కన్పించకముందే 50 రకాల క్యాన్సర్‌లను గుర్తించగలిగేట్టుగా పరిశోధనలు విజయవంతమయ్యాయి. ఫలితంగా ఇండియా సహా అన్ని దేశాల్లో కేన్సర్ గుర్తింపు, చికిత్స ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ఎన్‌హెచ్‌ఎస్ తెలిపింది. లక్షణాలు కన్పించకముందే కేన్సర్‌ను గుర్తించగలగడం నిజంగానే ఓ అద్భుత పరిణామం. అత్యంత త్వరితంగా కేన్సర్‌ను గుర్తించే సరళమైన రక్త పరీక్షగా పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ చికిత్సా విధానంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. లక్షణాలు కన్పించముందే గుర్తించడం వల్ల కేన్సర్‌కు మెరుగైన వైద్యం అందించగలదు. ఈ విధానం అందుబాటులో వస్తే కేన్సర్ బాధితుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించవచ్చు.
ఇండియాలో నేషనల్ కేన్సర్ రిజిస్టర్ ప్రోగ్రాం ప్రకారం ప్రతి 68 మంది పురుషుల్లో ఒకరు ఊపిరితిత్తుల కేన్సర్ బారిన పడుతున్నారని, ప్రతి 29 మహిళల్లో ఒకరు బ్రెస్ట్ కేన్సర్ వ్యాధికి గురవుతున్నారు. ప్రపంచ దేశాన్నింటికీ ఈ కొత్త పరిశోధనలు చాలా ఉపయోగపడతాయని కేన్సర్ నిపుణులు(Cancer Experts)చెబుతున్నారు. తక్కువ ఖర్చుతోనే కేన్సర్ వ్యాధి నుంచి బయటపడగలమంటున్నారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ 2018 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17 మిలియన్ల మంది కేన్సర్ వ్యాధితో పోరాడుతున్నారని అంచనా. 9 మిలియన్ల మంది కేన్సర్‌తో చనిపోయినట్టు నివేదిక వెల్లడించింది. ఈ కొత్త చికిత్సా విధానాన్ని 2023 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురానున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
Also read: గుడ్డు తినేవారికి హెచ్చరిక..! ఎక్కువగా తింటే వీటి బారిన పడటం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook