Best Summer Foods To Keep Your Body Cool: బాదం పప్పు ప్రతి రోజు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వీటిని ఎదుగుతున్న పిల్లలకు అల్పాహారంలో భాగంగా ఇవ్వడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. ప్రస్తుతం చాలా మంది బాదం పప్పులును రకరకాలుగా తీసుకుంటున్నారు. రాత్రి నీటిలో ఉదయాన్నే తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కారణంగా చాలా ముంది వీటిని తీసుకునేందుకు ఇష్టపడరు. ఎందుకంటే వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టి శరీర వేడిని పెంచకుండా ప్రతి రోజు నీటిలో నానబెట్టిన బాదం పప్పును తీసుకోవాల్సి ఉంటుంది.
రోజంతా నానబెట్టిన బాదంలో శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ బాదం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
నానబెట్టిన బాదం పొట్ట మంచిదేనా?:
వేసవిలో చాలా మందిలో పొట్ట సమస్యలతో పాటు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. కాబట్టి బాదం పప్పులను నానబెట్టకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా కేవలం నానబెట్టిన బాదం మాత్రమే ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
నానబెట్టిన తర్వాత తప్పకుండా బాదంపప్పు తొక్క తీసి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. తొక్క తీయకుండా తీసుకుంటే పొట్ట సమస్యలతో పాటు చర్మ సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పరిమితంగా బాదం తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రతి రోజు నానబెట్టి బాదం ప్రతి రోజు తీసుకోవడం వల్ల జుట్టు, చర్మానికి ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్ ఇ చర్మాన్ని మృదువుగా చేసేందుకు కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నానబెట్టిన ఈ పప్పులను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్లు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook