Apple Cider Vinegar For Weight Loss: లావుగా ఉన్న వారు పొట్ట తగ్గడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే భారీ వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ శరీర బరువును తగ్గించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా కొందరైతే బరువు తగ్గిన తర్వాత కూడా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీర బరువును తగ్గించుకోవడానికి తప్పకుండా వ్యాయామాలతో పాటు, తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల పానీయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
బరువు తగ్గడానికి ఈ డ్రింక్‌ను ప్రతి రోజూ తాగండి:
యాపిల్ సైడర్ వెనిగర్‌ని రెగ్యులర్‌గా తాగితే సులభంగా శరీర బరువు తగ్గడమేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చని ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర బరువును తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. సంవత్సరాల పాటు నిల్వ చేసిన ఆపిల్ సైడర్‌ను ప్రతి రోజూ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా యాపిల్ వెనిగర్ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రతి రోజూ తాగడం వల్ల శరీరంలో కేలరీల, కార్బోహైడ్రేట్లు అదుపులో ఉంటాయి. దీంతో జీర్ణక్రియ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా సులభంగా శరీర బరువు తగ్గుతారని ప్రముఖ వైద్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్ వెనిగర్ ఎలా తీసుకోవాలో తెలుసా?
యాపిల్ సైడర్ వెనిగర్ తాగడానికి.. ఒక గ్లాసు నీటిని తీసుకుని, దానికి 2 టీస్పూన్ల యాపిల్ వెనిగర్ కలపండి. ఉదయం, సాయంత్రం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగండి. ఎప్పుడు బరువు తగ్గే క్రమంలో యాపిల్ సైడర్ వెనిగర్‌ను నేరుగా తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది నేరుగా తాగడం వల్ల దంతాలకు హాని కలిగించడమేకాకుండా గుండెల్లో మంట, గొంతు నొప్పులకు దారి తీయోచ్చు.
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook