Bad Cholesterol: అతిగా ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మందిలో ఈ ఫుడ్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా చాలా మందిలో గుండెపోటు సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎంత సులభంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ నియంత్రించే ఆహారాలు, పండ్లను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల సులభంగా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పండును ప్రతి రోజు తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనాలు:
ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును సులభంగా నియంత్రిస్తాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
గుండె సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె పోటు రాకుండా సహాయపడుతుంది. ముఖ్యంగా రక్త పోటు సమస్యలతో బాధపడేవారు ఈ పండును ఉదయం ఆల్పాహారంలో తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కోవిడ్ తర్వాత చాలా మంది రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా చర్మ సమస్యలతో బారిన కూడా పడుతున్నారు. తరచుగా ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల మంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్లో ఉండే పోషకాలు సీజన్ వ్యాధులను సైతం దూరం చేస్తాయి. కాబట్టి తరచుగా ఫీవర్, జలుబు, పొట్ట నొప్పుల సమస్యలు ఉన్నవారు ఈ పండును తీసుకోవడం వల్ల ఉపశమమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి