Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ 4 ఆహారాలు తినొద్దు!

Rid Bad Cholesterol: చాలామందిలో దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ప్రధాన కారణం శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు అధికంగా పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. విచ్చలవిడిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం కారణంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పేరుకు పోతోంది. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 3, 2024, 10:00 PM IST
Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ 4 ఆహారాలు తినొద్దు!

Rid Bad Cholesterol: మారుతున్న జీవనశైలి ఆధునిక ఆహారపు అలవాట్ల కారణంగా అనేకమంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు ఇందులోని చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తున్నాయి. నిజానికి మనలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా శరీరంలోని వివిధ అవయవాల్లో చెడు కొవ్వు పేరుకు పోవడం కారణంగా హార్ట్ స్ట్రోక్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈ సమస్యల కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా సులభంగా కోల్పోతున్నారు. గంటల తరబడి కూర్చోవడం అనారోగ్యకరమైన ఆహారాలు విచ్చలవిడిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, ఎక్కువగా మద్యపానం సేవించడం వీటి కారణాలవల్లే చాలామంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా పేరుకు పోతుంది. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరమైంది. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. తీసుకునే ఆహారాన్ని కూడా ప్రత్యేకమైన డైట్‌లో తీసుకోవడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా నాలుగు రకాల ఆహారాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమస్యతో బాధపడేవారు అతిగా రెడ్ మీట్ తినడం మానుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందులో  కొవ్వు పదార్థాలు లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో అనేక రకాల మార్పులు వచ్చి చెడు కొవ్వు పెరుగుదలకు దారి తీయొచ్చు. ప్రస్తుతం చాలామంది స్ట్రీట్ ఫుడ్స్ అతిగా తీసుకుంటారు. ముఖ్యంగా ఇందులో వేయించినవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా వేయించినవి తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఇందులో ఉండే జిడ్డు పదార్థాలు శరీరంలోని కొలెస్ట్రాల్ పెరుగుదలకు దారి తీయవచ్చు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండడం ఎంతో మంచిది. డీప్ ఫ్రై చేసిన ఆహారాల్లో క్యాలరీలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి అతిగా తీసుకోవడం కారణంగా కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి గుండె ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పటికే గుండెపోటు, ఇతర హార్ట్ సమస్యలతో బాధపడుతున్న వారు వేయించిన ఆహారాలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ట్రై చేసిన ఆహారాలు తినాలనుకునేవారు హెయిర్ ఫ్రై ద్వారా తయారుచేసిన ఆహారానికి తీసుకోవడం ఎంతో మంచిది. కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు ప్రాసెస్ చేసిన ఆహారాలు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే వాటిల్లో ఉండే కొన్ని మూలకాలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

 ప్రస్తుతం చాలామంది మార్కెట్లో లభించే అధిక కొలెస్ట్రాల్ పోషకాలు తక్కువ కలిగిన ఆహారాలను అతిగా తీసుకుంటున్నారు. దీని కారణంగా కొలెస్ట్రాల్ సమస్య మరింత కఠినంగా మారవచ్చని ఆరోగ్యని గుణలు చెబుతున్నారు అయితే ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారు బిస్కెట్లతో పాటు బేకరీలో లభించే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఎంతో మంచిది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల కొంతమందిలో గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి ఆహారాలకు ఎంతో దూరంగా ఉండడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతిరోజు ఆహారంలో తప్పకుండా ఫైబర్ అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం ఎంతో మంచిది. అంతే కాకుండా పీచు అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజు ఆరోగ్యకరమైన పండ్లతో పాటు కూరగాయలను తీసుకోవడం ఎంతో మేలు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News