Benefits Of Detox Water: మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నాము. కొందరైతే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే మరికొందరు వ్యాయామాలు, యోగా చేస్తున్నారు. ఇవాన్ని చేసినా చాలా మందిలో శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతున్నాయి. అయితే ఇలా పేరుపోవడం వల్ల శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరం ఎలాంటి వ్యాధులకు గురికాకుండా ఉండడానికి తప్పకుండా శరీరాన్ని నిర్విషీకరణ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తం కూడా శుభ్రమవుతుంది. అప్పుడు అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే రక్తాన్ని శుభ్రం చేసుకోవడానికి ఎలాంటి ఆహార పదార్థాలను ఆహారంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణులు సూచించిన వివరాల ప్రకారం.. నిమ్మకాయ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆమ్ల గుణాలు రక్తాన్ని శుభ్రపరచడానికి సులభంగా సహాయపడతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. నిమ్మకాయలో విటమిన్ సి కూడా లభిస్తుంది. కాబట్టి శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.
అల్లం, బెల్లం టీ:
మనం రోజూ తాగే పాలు, పంచదారతో చేసిన టీ ఆరోగ్యానికి చాలా హానికరం. అయితే దీని బదులుగా అల్లం, బెల్లంతో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా రక్తంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించి రక్తన్ని శుభ్రం చేస్తాయి. అంతేకాకుండా దీన్ని తాగడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు కూడా దూరమవుతాయి.
గ్రీన్ కొత్తి మీర, పుదీనా టీ:
పచ్చి కొత్తిమీర, పుదీనా ఆకులు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది.
ఇది శరీరాన్ని డిటాక్స్ చేసేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి వీటితో తయారు చేసిన టీని ప్రతి రోజూ తాగడం వల్ల పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా వీటితో తయారు చేసిన టీని ప్రతి రోజూ 2 సార్లు తాగితే సీజనల్ వ్యాధులు కూడా దూరమవుతాయి.
తులసి టీ:
తులసి టీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలుంటాయి. కాబట్టి వీటిని టీ తయారు చేసుకునే క్రమంలో వేసుకుని తాగితే.. శరీరానికి యాంటీ బాక్టీరియల్, యాంటి వైరల్ లక్షణాల అందుతాయి. ఈ హెర్బల్ టీ తాగడం వల్ల శరీరాన్ని నిర్విషీకరణ చేసి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : Thalapathy Vijay No 1 Hero : అందుకే విజయ్ నెంబర్ వన్ హీరో.. బల్లగుద్ది చెప్పేసిన దిల్ రాజు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి