చలికాలం సమీపిస్తోంది. సీజన్ మారుతూనే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు పెరుగుతుంటాయి. ఇలాంటి సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకునేందుకు కొన్ని సులభమైన పద్ధతులున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
వాతావరణం మారగానే వివిధ రకాల ఇన్ఫెక్షన్లు చుట్టుముడుతుంటాయి. ఇందులో జలుబు, దగ్గు సర్వ సాధారణం. చలికాలం కావడంతో ఫంగస్, బ్యాక్టీరియా కూడా వేగంగా విస్తరిస్తుంది. ఒకసారి జలుబు సోకిందంటే ప్రశాంతంగా ఊపిరి పీల్చడం కూడా కష్టమౌతుంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. కొన్ని హోమ్ రెమిడీస్తో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
1. సీజన్ మారేటప్పుడు తినే తిండి, తాగే నీటి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. చల్లని పదార్ధాలు, చలవ చేసే పదార్ధాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని దూరంగా ఉంచాలి. వేడి పదార్ధాలు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. దగ్గు ఉన్నప్పుడు టీ, వేడి నీల్లు, కాఢా వంటివి ప్రయోజనకరంగా ఉంటుంది.
2. సీజనల్ దగ్గుని నియంత్రించేందుకు తేనె అద్భుతంగా పనిచేస్తుంది. మీ ఇంట్లో చిన్న పిల్లలకు దగ్గు ఉంటే..వేడి తేనె పట్టించాలి. దీనివల్ల పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
3. వేడి నీళ్లు ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. ఆవిరి పట్టించడం వల్ల మెరుగైన ఫలితాలుంటాయి. ఈ ప్రక్రియతో ఊపరితిత్తులపై మంచి ప్రభావం పడుతుంది. ఛాతీ నొప్పి తగ్గుతుంది. గొంతులో కఫం ఉంటే...ఆవిరి ప్రక్రియతో తొలగిపోతుంది. దగ్గు తగ్గిపోతుంది.
Also read: Cancer & Diabetes Remedies: ఆ కూరగాయతో కేన్సర్, డయాబెటిస్‌కు చెక్, 10 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook