Cardamom For Skin: చర్మ సౌందర్యం మెరుగయ్యేందుకు యాలకుల వినియోగం తప్పనిసరి!

Cardamom For Skin: ప్రతి ఇంట్లోని వంటింట్లో లభించే పెద్ద యాలకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పెద్ద యాలకు వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2022, 04:35 PM IST
Cardamom For Skin: చర్మ సౌందర్యం మెరుగయ్యేందుకు యాలకుల వినియోగం తప్పనిసరి!

Cardamom For Skin: ఇంట్లోని వంటింట్లో లభ్యమయ్యే పెద్ద యాలకులు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆహారంలో ఇది రుచితో పాటు ఆరోగ్యం కూడా అందిస్తుంది. అయితే పెద్ద యాలకుల వల్ల చర్మానికి పోషణ లభిస్తుందని మీకు తెలుసా? పెద్ద యాలకులలో చర్మానికి మేలు చేసే యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఇది చర్మంపై అలర్జీ సమస్యను కూడా దూరం చేస్తుంది. దీని వల్ల ముఖం మరింత కాంతి వంతంగా కనిపిస్తుంది. అయితే పెద్ద యాలకుల వల్ల కలిగే చర్మ సౌందర్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

యాలకులు ప్రయోజనాలు..

1) చర్మంపై స్క్రబ్ కోసం

యాలకుల స్క్రబ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి, చర్మాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తుంది. పెద్ద యాలకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, అవసరమైన ఖనిజాలు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది లోపలి నుండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

2) సర్క్యులేషన్ సరిచేస్తుంది

పెద్ద యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. పెద్ద యాలకులు చర్మంలోని టాక్సిన్స్ ను శుభ్రపరుస్తుంది. ఇది చర్మాన్ని కూడా డిటాక్సిఫై చేస్తుంది. దీనితో పాటు ఇది చర్మంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. చర్మాన్ని లోపలి నుంచి అందంగా మార్చడంలో సహాయం చేస్తుంది. 

3) వృద్ధాప్యం ఛాయలు రాకుండా..

పెద్ద యాలకులు చర్మంపై ఏర్పడే వృద్ధాప్య సంకేతాలను తొలగిస్తుంది. అదే సమయంలో ఇది మీ చర్మానికి మెరుపును కూడా తెస్తుంది. యాలకుల నుంచి యాంటీ రింకిల్ క్రీమ్ తయారూ చేయడం ద్వారా కూడా దీన్ని అప్లే చేయవచ్చు. ఇందులోని విటమిన్ ఇ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. ముఖంపై ముడతలు రాకుండా చేస్తుంది.

4) మొటిమల నివారణ..

పెద్ద యాలకులు ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. దీనితో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి ముఖంపై మచ్చలను తేలికగా నివారిస్తాయి. దీనితో పాటు వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని సెబమ్‌ను తగ్గిస్తాయి. మొటిమలు రాకుండా నివారిస్తాయి.

(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)  

Also Read: Weight Loss with Banana: అరటి పండును రోజూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

Also Read: Roasted Garlic Benefits: పురుషుల్లో లైంగిక శక్తి పెరుగుదల కోసం కాల్చిన వెల్లుల్లితో ఇలా చేయాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News