Control Body Cholesterol With Black Salt: ఉప్పు మన రోజువారీ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. అది లేకుండా ఆహారాలు తినడం చాలా కష్టం. ఆహారాలకు రుచిని కలిగించేవాటిలో ఉప్ప కూడా ప్రధానమైనది. అయితే ఉప్పును వినియోగించడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలో బలహీనత, వాంతులు, వికారంతో బాధపడుతున్నవారు నాలుకపై ఉప్పును వేసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇందులో ఉండే మూలకాలు అధిక కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును వినియోగించండి:
కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పును ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రించి, వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే నల్ల ఉప్పును తినడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
నల్ల ఉప్పు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే:
1. కొలెస్ట్రాల్ స్థాయిలకు చెక్:
అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్న వారికి నల్ల ఉప్పు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో ఉండే పరిమాణాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి..కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అధిక రక్త పోటు సమస్యలు కూడా దూరమవుతాయి.
2. బరువు పెరగడం:
చాలా మంది శరీర బరువు తగ్గించుకునేందుకు వివిధ రకాల డైట్స్‌ను అనుసరిస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడానికి అనుసరించే డైట్‌లో తప్పకుండా నల్ల ఉప్పును వినియోగించాలని ఆరోగ్య నిపునులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు బొడ్డు చుట్టు కొవ్వు తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
3. వాంతులు, మలబద్ధకం:
చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా వాంతులు, మలబద్ధకం సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన నల్ల ఉప్పును ఆహారాల్లో వినియోగించాల్సి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా వినియోగిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి