Cholesterol Reduce Drinks: శరీరంలో కొవ్వు పరిమాణం పెరిగితే అనేక వ్యాధుల భారిన పడే ప్రమాదం పెరుగుతుంది. గుండె సంబంధిత సమస్యలు అన్నింటికి కల ముఖ్య కారణం షరీరంలో కొలెస్ట్రాల్ పెరగటం. ఇలాంటి సమయంలో మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. ముఖ్యంగా శరీరంలో కొవ్వు పరిణామం తగ్గాలంటే.. రోజు కొన్ని డ్రింక్స్ ని తాగాలి. కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని సహజ డ్రింక్స్ గురించి ఇక్కడ తెలుపబడింది.
టమాట జ్యూస్..
దాదాపు ప్రతి ఇంట్లో వంటలలో ఉపయోగించే కూరగాయ టమాట. టమాట రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని మీకు తెలుసా..?టమాటల్లో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం లిపిడ్ స్థాయిలని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. కావున రోజు టమాట జ్యూస్ తాగాలి.
కోకో డ్రింక్..
మీరు డార్క్ చాక్లెట్ తిని ఉంటె కోకో పేరు తప్పకుండా వినే ఉంటారు.ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడంలో సహాయపడే 'ఫ్లేవనాల్' అనే యాంటీ ఆక్సిడెంట్‌ను కలిగి ఉంటుంది. అలాగే కోకో డ్రింక్స్ లో ఉండే మోనో-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా శరీరానికి మేలు చేస్తాయి.
Also Read: Navdeep Drug Case: హీరో నవదీప్‌కు బిగ్ షాక్.. డ్రగ్స్ కేసులో అరెస్టు తప్పదా?
ఓట్స్ డ్రింక్..
ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవి. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్‌లు ఉంటాయి. ఇవి కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ జెల్ కొలెస్ట్రాల్ శోషణ రేటును తగ్గిస్తుంది. మరియు దీని వల్ల మెరుగైన ఫలితాలు లభిస్తాయి.
గ్రీన్ టీ..
గ్రీన్ టీ బరువు తగ్గించడంలో ఎంతో మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో ఉండే 'క్యాటెచిన్స్' మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది హై బీపీ, గుండెపోటు మరియు మధుమేహం వంటి వ్యాధుల వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: Samantha Naga Chaitanya: నాగచైతన్యతో ప్యాచ్-అప్‌కు సమంత రెడీ?.. ఇదిగో సాక్ష్యం!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook