Daily one hour walking benefits: ప్రతి వాకింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సమయం లేనివారు కనీసం ప్రతిరోజు ఒక గంట పాటు నడిస్తే మీలో ఎన్నో రోగాలు నయం అవుతాయి అంటే ముఖ్యంగా మీ కండరాలు బలంగా మారుతాయి. టెన్షన్ తగ్గుతుంది యాంగ్జైటీ కూడా తగ్గిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది ప్రతిరోజు నడవడం వల్ల బరువు ఈజీగా తగ్గిపోతారు. మీ శక్తి సామర్థ్యాలు కూడా పెరిగిపోతాయి. అంతేకాదు ప్రతిరోజు నడవడం వల్ల మంచి నిద్రకు ఉపక్రమిస్తారు. దీనివల్ల ఆరోగ్యం ఫిట్నెస్ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు ఒక గంట పాటు నడిస్తే మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవి ఏంటో తెలుసుకుందాం.
గుండె ఆరోగ్యం..
ఎక్ససైజ్ కంటే వాకింగ్ చేయడం కాస్త తక్కువ ప్రభావం చూపుతుంది. కానీ సరైన ప్రభావాన్ని త్వరగా చూపిస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా ఉండే కార్డియోవాస్క్యూలర్ సమస్యలు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు పెద్దలు ఒక అరగంట పాటు నడిస్తే వారి ఆరోగ్యం శక్తి సామర్థ్యాలు బాగుంటాయి.
స్ట్రెస్ తగ్గుతుంది..
ప్రతిరోజు ఒక గంట పాటు నడవడం వల్ల మన రక్తప్రసరణ మెరుగ్గా మారుతుంది. రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది బ్రెయిన్ పనితీరుకు కూడా సహాయపడుతుంది. స్ట్రెస్ హార్మోన్స్ తగ్గుతాయి అని ఎన్ఐహెచ్ తెలిపింది.
ఫెర్టిలిటీ పెంచుతుంది..
ప్రతిరోజు ఒక గంట పాటు అన్న వాకింగ్ చేయడం వల్ల ఫెర్టిలిటీ రేటు పెరుగుతుందని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఫెర్టిలిటీ సమస్య ఉన్నవారు ప్రతిరోజు ఒక గంట పాటు వాకింగ్ చేయడం మొదలెట్టాలి.
ఇదీ చదవండి: ఖాళీ కడుపున వెల్లుల్లి రసం తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
మెమొరీ..
వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపును వాకింగ్ చేయడం వల్ల తొలగిపోతాయి. ఎందుకంటే బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. వృద్ధులు కూడా ప్రతిరోజు చిన్నపాటి వాకింగ్ చేయడం వల్ల వారి మెదడు ఆరోగ్యంగా పనిచేస్తుంది.
ఇమ్యూనిటీ బూస్ట్..
వాకింగ్ చేయడం వల్ల మన ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది ఆర్థరైటి సమస్యలు కూడా కాపాడుతుందని ఎన్ ఐ హెచ్ తెలిపింది.
ఇదీ చదవండి: ఖాళీ కడుపున వాము టీ తీసుకుంటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
ఎముకలు..
ప్రతిరోజు నడవడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా బలంగా మారుతాయి ఇది అన్ని వయసుల వారికి వర్తిస్తుంది మీరు కూడా ఈరోజు నుంచి ప్రతి రోజు ఒక గంట అరగంట పాటున వాకింగ్ చేయడం మొదలెట్టండి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి