Healthy Hair Tips: మన చుట్టూ ఉండే గాలి, నీరు, కాలుష్యం వంటి వివిధ కారణాలతో తలలో చుండ్రు సమస్య పెరిగిపోతోంది. సాధారణంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రం చలికాలం దాటినా ఈ సమస్య నుంచి విముక్తి పొందలేకపోతుంటారు. చుండ్రు కారణంగా నలుగురిలో అసౌకర్యం కూడా కలుగుతుంటుంది.
చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందేందుకు చాలా రకాల పద్ధతులు పాటిస్తుంటారు. కానీ ఒక్కోసారి ఏవీ సరైన ఫలితాలనివ్వవు. ఈ క్రమంలో అత్యంత తక్కువ ఖర్చుతో చాలా సులభంగా డేండ్రఫ్‌ను పోగొట్టే అద్బుతమైన చిట్కా ఉంది. ప్రతి ఇంట్లో కిచెన్‌లో తప్పకుండా ఉండే పసుపుతో చుండ్రు సమస్యను ఇట్టే దూరం చేయవచ్చంటున్నారు బ్యుటీషియన్లు. ఆయుర్వేదపరంగా పసుపుకు చాలా ఔషధ గుణాలున్నాయి. చర్మం ట్యానింగ్ సమస్య, ఇతర సమస్యలతో పాటు మొటిమలు అన్నీ దూరమౌతాయి. శరీరంలో అంతర్గతంగా కూడా పసుపు చాలా ఆరోగ్యకరమైంది. వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతుంది.
అయితే పసుపును చాలా రకాలుగా ఇతర సమస్యలకు వాడి ఉండవచ్చు. కానీ కేశ సంరక్షణలో బహుశా వినియోగించి ఉండరు. ఎందుకంటే పసుపు కేశాల సంరక్షణలో అద్భుతంగా ఉపయోగపడుతుందనేది చాలా తక్కువ మందికి తెలుసు. డేండ్రఫ్ దూరం చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా దూరం చేస్తుంది. అంతేకాదు కేశాల కుదుళ్లకు బలం చేకూరుస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. జుట్టు రాలడం, దురద, చుండ్రు సమస్యను తగ్గించడంలో ఇవి దోహదం చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి హెయిర్ ఫోలికల్స్‌ను రక్షిస్తాయి. యాంటీ ఫంగల్‌లా పనిచేయడం వల్ల చుండ్రు సమస్య పోతుంది.
చుండ్రు సమస్యకు పసుపు ఎలా వాడాలంటే
రోజూ వినియోగించే ఏదైనా మైల్డ్ షాంపూలో 1 టీ స్పూన్ పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రుద్ది..స్కాల్ప్ శుభ్రం చేయాలి. మరో పద్ధతిలో పావు కప్పు కొబ్బరి నూనెలో 1 టీ స్పూన్ పసుపు పొడి కలపాలి. షాంపూ వాడటానికి అరగంట ముందు తలకు, జుట్టుకు పట్టించి మసాజ్ చేయాలి. ఈ రెండు పద్ధతులతో చండ్రు పోవడమే కాకుండా మృదువుగా మారుతుంది.
1 కప్పు నీళ్లలో 1 టీ స్పూన్ పసుపు కలిపి షాంపూతో తలస్నానం తరువాత ఈ నీళ్లను తలకు రాసుకోవాలి. ఓ 20 నిమిషాలుంచి ఆ తరువాత నీళ్లుతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మరో పద్ధతిలో అర కప్పు పుల్లని పెరుగులో 2 చెంచాల ఆలివ్ ఆయిల్, 2 చెంచాల పసుపు పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ అరగంట ఉంచాలి. తరువాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే చాలు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.
Also read: Milk Precautions: ఆస్తమా రోగులు పాలు తాగవచ్చా లేదా, నిజానిజాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook