Diabetic Diet Chart: రాజ్‌గిరాతో శరీర బరువు, మధుమేహానికి 8 రోజుల్లో శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు..

Ramdana For Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వారు రాజ్‌గిరా ఆహారంలో తీసుకుంటే రక్తంలోని చక్కర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వీటిని తప్పకుండా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 11, 2022, 04:17 PM IST
Diabetic Diet Chart: రాజ్‌గిరాతో శరీర బరువు, మధుమేహానికి  8 రోజుల్లో శాశ్వతంగా చెక్‌ పెట్టొచ్చు..

Ramdana For Diabetes: ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల పాలవుతున్నారు. చాలామంది మధుమేహం వ్యాధితో కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో డయాబెటిస్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. మధుమేహంతో బాధపడుతున్న ఎక్కువగా ఆందోళన చెందడానికి కారణాలు రక్తంలోని చక్కర పరిమాణాలు హెచ్చుతగ్గులు కావడం. రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగితే ప్రాణానికే ముప్పు కాబట్టి షుగర్ పేషెంట్స్ రక్తంలోని చక్కర పరిమాణాలను ఎప్పుడు అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండాలి. ఒకవేళ రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉండలేకపోతే తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు ఆరోగ్యకరమైన ఆహారాలను, చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది.

రాజ్‌గిరా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రాజ్‌గిరా ఉండే మూలకాలు శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులనుంచి సంరక్షిస్తుంది. అంతేకాకుండా వీటితో తయారుచేసిన లడ్డూలను ప్రతిరోజు తినడం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారికి చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. 

డయాబెటిస్ ఉన్నవారు రాజ్‌గిరా తినడం వల్ల కలిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వీటిని గ్లూటెన్ రహిత ధాన్యాలుగా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వారు వీటితో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి ముఖ్యంగా ఉవ్వకాయం సమస్య నుంచి సులభంగా విముక్తి లభిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు రాజ్‌గిరాను తప్పకుండా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 

రాజ్‌గిరాలో అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల ఆకలిని నియంత్రించి సులభంగా శరీర బరువును తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. 

రాజ్‌గిరా ఇలా తినండి:
>>రాజ్‌గిరాను రోటీల రూపంలో కూడా తినొచ్చు. మధుమేహం ఉన్నవారు వీటి రోటీలను తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 
>>ప్రస్తుతం మార్కెట్లో వీటితో తయారుచేసిన బిస్కెట్లు కూడా లభిస్తున్నాయి. కాబట్టి వీటిని తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయి.
>>వీటిని ఇతర ఆహారాల్లో కూడా వేసుకొని ప్రతిరోజు తినొచ్చు. వీటితో తయారుచేసిన ఆహారాలను క్రమం తప్పకుండా తింటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇది కూడా చదవండి : AAP as National Party: ఆప్‌కు అరుదైన గుర్తింపు, ఇక ఆమ్ ఆద్మీ జాతీయ పార్టీ

ఇది కూడా చదవండి : Himachal pradesh Results: హిమాచల్‌లో కొనసాగిన సాంప్రదాయం, అధికారం కాంగ్రెస్ పరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News