Alcohol Benefits And Disadvantages: ఆల్కహాల్ అనేది ఒక రకమైన డ్రగ్. దీనిని సాధారణంగా పార్టీల్లో, కొన్ని సంద్భరల్లో చాలామంది తాగుతారు. నేటికాలంలో ఆల్కహాల్ వినియోగం బాగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది దీనికి బానిసలవుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇది కాలేయం, గుండె, మెదడుకు హాని చేస్తుంది. అంతే కాకుండా ఆల్కహాల్ వ్యసనం వల్ల వ్యక్తిగత, సామాజిక సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అధ్యయనాల ప్రకారం ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది అలాగే ఆరోగ్యానికి హానికరమైనది. ప్రతిరోజు ఆల్కహాల్ తాగడం కలిగే లాభాలు, నష్టాలు గురించి తెలుసుకుందాం.
ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు అనేవి వ్యక్తి ఆరోగ్యం, వయస్సు, జీవనశైలిపై ఆధారపడి ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి.
లాభాలు:
కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతిరోజు మితంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రెడ్ వైన్ లోని యాంటీఆక్సిడెంట్లు గుండెకు మంచి చేస్తాయి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి. కొంతమందికి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
నష్టాలు:
ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాలేయ సిర్రోసిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.
ఆల్కహాల్ వ్యసనం ఒక తీవ్రమైన సమస్య. దీనికి చికిత్స ఎంతో అవసరం. ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకోవడం మంచిదా లేదా చెడ్డదా అనేది వ్యక్తి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మితంగా ఆల్కహాల్ తీసుకోవచ్చు. కానీ ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.మీరు ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే దాని గురించి మీ డాక్టర్‌తో మాట్లాడటం మంచిది. మీ డాక్టర్ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీకు సరైన సలహా ఇవ్వగలరు.
AlsoRead: HMPV Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తున్న హెచ్ఎంపీవీ, ఏం చేయాలి, ఏం చేయకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి