Home Remedy For Gastric Problem: ప్రస్తుతం చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. అతిగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, ఆధునిక జీవనశైలి నిద్ర లేకపోవడం కారణంగా చిన్న వయసులోనే గ్యాస్టిక్ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఉపశమనం పొందడం చాలా మంచిది.. లేకపోతే అనేక రకాల పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో గ్యాస్ట్రిక్ కారణంగా జీర్ణ క్రియ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమస్య బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడమే కాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని హోమ్ రెమెడీస్ వినియోగించడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే గ్యాస్టిక్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఎలాంటి హోమ్ రెమెడీస్ ను వినియోగించడం మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ట్రిక్ సమస్యకు 5 హోమ్ రెమెడీస్:
కొన్ని సులభమైన హోమ్ రెమెడీస్ తో ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు:
1. అల్లం:
గ్యాస్టిక్ సమస్యకు అల్లం ప్రభావంతంగా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు అల్లాన్ని బాగా నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల సులభంగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇలా ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.
2. పెరుగు:
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు రోజుకు రెండుసార్లు అయినా పెరుగుతో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. పెరుగుతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినని వారు ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల చక్కెరను కనుక్కొని కూడా తినొచ్చు.
3. జీలకర్ర:
జీలకర్ర నీరులో శరీరానికి అవసరమయ్యే అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన నీటిని ప్రతిరోజు తాగడం వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా గ్యాస్టిక్ సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు పొట్టలోని ప్రేగులను శుభ్రం చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని ఒకసారి ట్రై చేయండి.
4. పుదీనా:
పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట పుదీనా ఆకులతో తయారుచేసిన రసాన్ని దాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్టిక్ సమస్య నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ల బారిన కూడా పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.
5. నిమ్మరసం:
నిమ్మరసంలో అనేక రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే కొన్ని పోషకాలు శరీరాన్ని హైడ్రేట్ గా చేసేందుకు ఎంతగానో సహాయపడతాయి. అయితే గ్యాస్టిక్ సమస్యతో బాధపడే వారికి కూడా నిమ్మరసం ప్రభావంతంగా సహాయపడుతుంది. తరచుగా ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం, టేబుల్ స్పూన్ తేనెను కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి