Morning Sickness Remedies: గర్భిణీ మహిళల్లో సర్వ సాధారణంగా కన్పించే మార్నింక్ సిక్నెస్ సమస్య కేవలం ఉదయం వేళలకే పరిమితం కాదు. రోజంతా ఉంటుంది. వాంతులు, అలసట, తలనొప్పి, నోరంతా చేదుగా లేదా పుల్లగా ఉండటం వంటి లక్షణాలతో అనారోగ్యంగా ఉంటుంది.
గర్భిణీ మహిళల్లో రోజంతా వికారం, వాంతులు, తలనొప్పి, నోరంతా పుల్లగా ఉండటం, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. దీనినే మార్నింగ్ సిక్నెస్ అంటారు. పేరు అలా ఉన్నా రోజంతా ఉంటుంది. సాధారమంగా గర్భం దాల్చడానికి 12 వారాల వరకూ ఉంటుంది. తరువాత తగ్గిపోతుంటుంది. ఇంకొంతమందిలో అలానే ఉంటుంది. మార్నింగ్ సిక్నెస్ ఎందుకు వస్తుందనేది పూర్తిగా తెలియకపోయినా హార్మోన్ మార్పుల కారణంగా వస్తుంటుందని తెలుస్తోంది. మార్నింగ్ సిక్నెస్‌కు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కానీ కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆహారం తక్కువ మోతాదులో 5-6 సార్లు తీసుకోవాలి. ఒకేసారి కడుపు నిండకుండా చూసుకోవాలి. మద్య మధ్యలో ఏదైనా డ్రింక్స్ తాగితే మంచిది. లిక్విడ్ పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు, జ్యూస్, సూప్ వంటివి తీసుకోవచ్చు. సుగంధ పదార్ధాలకు దూరంగా ఉండాలి. కాఫీ, టీ, ధూమపానం వంటివి మార్నింగ్ సిక్నెస్ సమస్యను మరింతగా పెంచవచ్చు.
అల్లం తీసుకోవడం మంచిది. అల్లం ఓ సహజసిద్దమైన ఔషధంలా పనిచేస్తుంది. ఇది వికారం, వాంతులను తగ్గిస్తుంది. అల్లం టీ తాగడం లేదా చిన్న చిన్న అల్లం ముక్కల్ని నమిలి తినడం మంచిది. విటమిన్ బి6 సప్లిమెంట్స్ తీసుకుంటే ప్రయోజనకరం. విటమిన్ బి6 ఎక్కువగా ఉండే పదార్ధాలు మాంసం, చేపలు, గుడ్లు, పాలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
మార్నింగ్ సిక్నెస్ సమస్యకు ప్రత్యేకమైన చికిత్స లేకపోయినా పరిస్థితి తీవ్రంగా ఉంటే మాత్రం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. ప్రోటీన్, ఐరన్ తగినంతగా ఉండే ఆహారం తీసుకుంటే ఈ సమస్య రాకుండా నియంత్రించవచ్చు. క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయాలి. దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది. మార్నింగ్ సిక్నెస్‌లో ఎదురయ్యే లక్షణాలు తగ్గుతాయి.
ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుుడు సరైన ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా మార్నింగ్ సిక్నెస్ సమస్య నుంచి బయటపడవచ్చు. లేకపోతే రోజువారీ జీవితం నరకంగా మారుతుంది.
Also read: Rahul Gandhi Padayatra: మరో యాత్రకు సిద్ధం, జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook