Resuce Cholesterol in 4 Weeks: ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్య కొలెస్ట్రాల్. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువున్నా..ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభమైన ఇంటి చిట్కాలతో కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు..
కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. ఒక్క కొలెస్ట్రాల్ వివిధ వ్యాధులకు కారణమౌతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అధిక రక్తపోటు, గుండెపోటు, డయాబెటిస్ వంటి ప్రమాదకర వ్యాధులు వెంటాడుతాయి. ఇంకా గుండెకు సంబంధించిన కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ డిసీజ్ ముప్పు కూడా ఉంటుంది. అయితే ప్రతి ఇంట్లో లభించే అల్లంతో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అల్లంను నాలుగు రకాలుగా ఉపయోగిస్తూ..ట్రైగ్లిసరాయిడ్స్, లిపోప్రోటీన్ తగ్గించుకోవచ్చు.
1. అల్లంను నేరుగా తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకవేళ మీకు ఎక్కువగా ఆయిల్ తినే అలవాటుంటే..పచ్చి అల్లం నమిలి తినాల్సి ఉంటుంది. దీనివల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరగకుండా నియంత్రణలో ఉంటుంది.
2. అల్లం పౌడర్ తయారు చేసుకుని కూడా వినియోగించవచ్చు. దీనికోసం కొన్నిరోజులు అల్లంను ఎండలో ఆరబెట్టాలి. ఆ తరువాత మిక్సీలో గ్రైండ్ చేసి పౌడర్ చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున నీళ్లలో ఒక స్పూన్ అల్లం పౌడర్ కలుపుకుని తాగితే బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంటుంది.
3. ఇక మరో విధానం అల్లం నీరు. దీనికోసం ఒక గ్లాసు వేడి నీటిలో కొద్దిగా అల్లం కట్ చేసి వేసి ఓ 15 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తరువాత వడపోసి భోజనం తరువాత తాగాలి. ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ త్వరగా తగ్గుతుంది.
4. మరో విధానం అల్లం, నిమ్మకాయ టీ. అల్లం, నిమ్మకాయతో చేసిన టీ తాగితే అద్భుత ప్రయోజనాలుంటాయి. బ్లడ్ కొలెస్ట్రాల్ ప్రభావాన్ని, బ్లడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అల్లం నిమ్మకాయ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
Also read: Body Pains: తీవ్రమైన ఒంటి నొప్పులు, అలసట నుంచి క్షణాల్లో ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook