Constipation Problem: ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో ఆయిలీ, మసాలా వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్ధాల సేవనం ఎక్కువ. అందుకే కడుపు సంబంధిత వ్యాధులు ఇక్కడే ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఈ తరహా ఆహార పదార్ధాల వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్.
జీవనశైలి సక్రమంగా ఉండటమే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా బాగుండాలి. అప్పుడే ఆరోగ్యం ఉంటుంది. అలా కాకుండా జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తరచూ తీసుకుంటుంటే జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా కడుపులో సమస్య తలెత్తుతుంది. ఈ తరహ తిండి ఎక్కువగా తినేవారిలో మలబద్ధకం ప్రధాన సమస్యగా కన్పిస్తుంటుంది. అయితే కొన్న చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. మలబద్ధకం సమస్య ఉంటే ఈ వ్యక్తి జీవితం నరక ప్రాయంగా మారిపోతుంది. దినచర్యపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుకే రోజూ రాత్రి వేళ గ్లాసు పాలలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకుని తాగాలి. పాలలో అన్నిరకాల న్యూట్రియంట్లు, నెయ్యిలో ఉండే కొవ్వు కారణంగా ఆరోగ్యంపై మంచి ప్రభావం పడుతుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది.
చాలామందికి ఎముకల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ సమస్య ఉన్నప్పుుడు రాత్రి వేళ పాలలో నెయ్యి కలుపుకునితాగితే కీళ్లలో లూబ్రికేషన్‌లా పనిచేస్తుంది. స్వెల్లింగ్, పెయిన్ దూరమౌతాయి. అదే సమయంలో మల బద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. మీరు ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసేవారైతే..స్టామినా అవసరమైతే పాలు-నెయ్యి కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే కొన్ని వారాల్లోనే మంచి ఫలితాలు చూడవచ్చు.
రోజూ రాత్రి వేళ పాలు నెయ్యి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడేవారికి ఇది మంచి సూచన. ఇలా చేయడం వల్ల రాత్రి వేళ 7-8 గంటలు మంచి సుఖమైన నిద్ర పడుతుంది.
Also read: Strong Bones: వయస్సుతో పాటు ఎముకలు పటుత్వం కోల్పోతున్నాయా, ఇలా చేయండి చాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook