Heart Health: మానవ శరీరంలో గుండె, కిడ్నీ, లివర్ అత్యంత ముఖ్యమైన అంగాలు. ఈ మూడు ఆరోగ్యంగా ఉంంటేనే మనిషికి ప్రాణాపాయం తగ్గుతుంది. ఇందులో మరీ ముఖ్యమైంది గుండె. గుండెను ఆరోగ్యంగా ఉంచకపోతే హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. గుండెను ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. తగిన విధంగా జాగ్ర్తత్తలు తీసుకోవాలి. గుండె ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి ప్రాణం ఉంటుంది. గుండె ఆరోగ్యంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే హార్ట్ ఎటాక్ వంటి ప్రమాదకర వ్యాధులు తలెత్తుతాయి. తెలిసో తెలియకో చేసే తప్పుల వల్ల గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది. సాధారణంగా హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు చెడు జీవనశైలి కారణంగా తలెత్తుతుంటుంది. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీనడం వల్ల గుండె వ్యాధి సమస్యలు వస్తుంటాయి. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కొన్ని పద్ధతులు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో స్మోకింగ్‌కు చాలామంది అలవాటు పడుతున్నారు. ఈ దురలవాటు గుండెను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే సిగరెట్ పొగ అనేద రక్తాన్ని చిక్కగా మార్చుతుంది. దాంతో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి. ఇది కాస్తా రక్త సరఫరాపై ప్రభావం కనబరుస్తుంది. హార్ట్ ఎటాక్ ముప్పు పెరిగిపోతుంది. చాలా సందర్భాల్లో రక్తపోటు సమస్య అధికమౌతుంది.
ఇక గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు చేయాల్సిన మరో పని ఒత్తిడిని తగ్గించుకోవడం. ఒత్తిడి అనేది మనిషి శరీరంపై ప్రభావం చూపించడమే కాకుండా హానీ చేకూరుస్తుంది. ఎక్కువగా ఒత్తిడి తీసుకుంటేహ హార్ట్ రేట్ పెరిగిపోతుంది. ఫలితంగా రక్తపోటు అసాధారణంగా మారిపోతుంది.
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ముందుగా చేయాల్సింది బరువు తగ్గించడం. ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటే తప్పకుండా గుండెపై ప్రభావం చూపిస్తుంది. స్థూలకాయం అనేది గుండె వ్యాధుల్ని పెంచుతుంది. అందుకే బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉండేట్టు చూసుకోవాలి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ పద్ధతుల్ని పాటిస్తూనే రోజూ ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
Also: Earbuds Usage: నిద్రపోయేటప్పుడు చెవుల్లో బడ్స్ పెట్టుకునే అలవాటుందా, ఏమౌతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook