Health Tips: ఆకలేయడం లేదని తేలిగ్గా తీసుకోవద్దు, ప్రమాదకర వ్యాదికి కారణం కావచ్చు

Health Tips: మనిషి ఆరోగ్యం విలువ అనేది అనారోగ్యంతో ఉన్నప్పుుడే తెలుస్తుంది. ఆరోగ్యేంగా ఉన్నంతవరకూ ఆ విలువ తెలియదు. అందుకే ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు పదే పదే సూచిస్తుంటారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 25, 2023, 07:05 PM IST
Health Tips: ఆకలేయడం లేదని తేలిగ్గా తీసుకోవద్దు, ప్రమాదకర వ్యాదికి కారణం కావచ్చు

Health Tips: ఆకలి వేయడం లేదు అనే సమస్యను మనం తరచూ వింటుంటాం. వృద్ధుల్లో ఈ సమస్య  ఎక్కువగా ఉండవచ్చు. ఈ సమస్యను చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకర సమస్యలు దారి తీయవచ్చంటున్నారు వైద్యులు. ఆ పూర్తి వివరాలు మీ కోసం..

మనిషి శరీరంలో అంతర్గతం ఏర్పడే లోపాలు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. ఇవి వివిధ వ్యాధులకు దారి తీయవచ్చు. మనిషి శరీరంలో కొన్ని రకాల విటమిన్లు లేదా మినరల్స్ లోపిస్తే కొన్ని ప్రత్యేక సమస్యలు ఏర్పడవచ్చు. వీటిలో ముఖ్యమైనది మెగ్నీషియం. మెగ్నీషియం లోపాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే మెగ్నీషియం శరీరానికి ఎనర్జీ ఇవ్వడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రిస్తుంది. హార్మోన్ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది. ఆకు కూరలు, కూరగాయలు ఎక్కువగా తినడం ద్వారా మెగ్నీషయం లోపాన్ని సరిచేసుకోవచ్చు..

శరీరంలో ఉండే వివిధ రకాల ఎంజైమ్స్ పనితీరును మెరుగుపర్చేది మెగ్నీషియం మాత్రమే. కార్పోహైడ్రేట్స్ నుంచి ఫ్యాట్, ప్రోటీన్స్ వరకూ అన్నింటినీ జీర్ణం చేసేది మెగ్నీషియమే. అందుకే నాడీ వ్యవస్ఖ సక్రమంగా పనిచేయాలంటే మెగ్నీషియం శరీరంలో తగిన మోతాదులో ఉండాలి. రక్తపోటు నియంత్రణలో ఉండాలన్నా కూడా మెగ్నీషియం అవసరం. మనిషి శరీరానికి రోజుకు కావల్సిన మెగ్నీషియం మోతాదు 400 మిల్లీ గ్రాములు. మహిళలకు 300 మిల్లీగ్రాములుండాలి.

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో మెగ్నీషియం లేకపోతే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ఆకలి వేయకపోవడం అనేది ప్రధానంగా కన్పించే లక్షణం. దీంతోపాటు వాంతులు వచ్చినట్టుండటం,  నీరసం ఉంటాయి. అదే సమయంలో హార్ట్ బీట్‌లో ఎగుడుదిగుడు ఉంటుంది. కళ్లు మసకగా కన్పిస్తుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడంతో అధిక రక్తపోటు వేధిస్తుంది. ఆస్తమా సమస్య కూడా రావచ్చు. ఈ పరిస్థితి క్రమంగా గుండెపోటుకు దారి తీయవచ్చు. అంటే ఆకలి వేయకపోవడమనే సమస్య తరచూ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు. మెగ్నీషియం లోపం ఉండి ఉండవచ్చు. మెగ్నీషియం లోపం అనేది గుండెపోటుకు దారి తీస్తుంది. 

మెగ్నీషియం లోపాన్ని తక్షణం తీర్చాలంటే కాఫీ తాగడం లేదా డార్క్ చాకోలేట్ తినడం చేయాలి. రోజుకు ఒక డార్క్ చాకొలేట్ తినడం మంచిదే. ఆకుకూరలు, కూరగాయల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం కోసం ఖర్జూరం, బఠాణీ, కోకో, జీడిపప్పు, పాస్తా, తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, బ్రౌన్ రైస్, ఓట్స్ , బ్రోకోలీ తింటే మెరుగైన ఫలితాలుంటాయి.

మెగ్నీషియం లోటు ఉన్నట్టు కన్పిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఏమాత్రం నిర్లక్ష్యం ప్రదర్సించినా వివిద రకాల వ్యాధులకు దారి తీస్తుంది. అందుకే జంక్స్ ఫుడ్ తగ్గించి పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి హెల్తీ ఫుడ్స్ తీసుకోవాలి. 

Also read: Heart Problems In Youth: యువతను టెన్షన్ పెడుతున్న గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News